English | Telugu
హీరో విజయ్ కూతురు ఆత్మహత్య.. కారణమదేనా?
Updated : Sep 18, 2023
తమిళ హీరో విజయ్ ఆంటోని ఇంట విషాదం నెలకొంది. ఆయన కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న మీరా, ఈ తెల్లవారు జామున తన గదిలోని ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
విజయ్ ఆంటోని తన కుటుంబంతో చెన్నైలోని అల్వార్ పేట డీడీకే రోడ్ లో నివాసముంటున్నాడు. అతని కుమార్తె మీరా చర్చ్ పార్క్ స్కూల్ లో 12వ తరగతి చదువుతుంది. కాగా, బాలిక తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఉరి వేసుకోవడంతో, అది గమనించిన కుటుంబసభ్యులు దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చదువుల ఒత్తిడి వల్లే మీరా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంగీత దర్శకుడి నుంచి హీరోగా మారిన విజయ్.. విభిన్న చిత్రాలతో తమిళనాట తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'బిచ్చగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు.