English | Telugu
చంద్రబాబుకి మద్దతుగా తారకరత్న పిల్లలు!
Updated : Sep 18, 2023
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పట్ల పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎందరో చంద్రబాబుకి తమ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా నందమూరి తారకరత్న పిల్లలు కూడా మీ వెంటే మేము అంటూ తమ మద్దతును తెలిపారు.
తారకరత్నకి తెలుగుదేశమన్నా, ఎన్టీఆర్ అన్నా, చంద్రబాబన్నా ఎంతటి అభిమానమో తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 40 ఏళ్ళ వయసులోనే ఆయన గుండె సమస్యతో కన్నుమూయడంతో పార్టీ కార్యకర్తలు ఎంతో ఆవేదన చెందారు. అయితే తారకరత్న వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన పిల్లలు తెలుగుదేశం పైన, బాబు పైన తమ అభిమానాన్ని చాటుతున్నారు. "బాబుతో నేను", "ఈ పోరాటంలో మేమంతా మీ వెంటే" అని రాసుకున్న ప్లకార్డులు పట్టుకొని చంద్రబాబుకి మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిన్నపిల్లలు అయినప్పటికీ తమ బాధ్యత అన్నట్టుగా ప్లకార్డులు పట్టుకొని బాబుకి మద్దతు తెలపడం చూసి.. తెలుగుదేశం కార్యకర్తలు, నందమూరి అభిమానులు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.