English | Telugu
ఓటీటీలోకి 'భగవంత్ కేసరి'.. ఎప్పుడు? ఎక్కడ?
Updated : Oct 19, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'భగవంత్ కేసరి' నేడు(అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్ తో పాటు ఇప్పటికే చాలా చోట్ల మొదటి షోలు పూర్తయ్యాయి. ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 'అఖండ', 'వీరసింహారెడ్డి' విజయాలతో జోరు మీదున్న బాలయ్య హ్యాట్రిక్ కొట్టాడని నందమూరి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సంబంధించిన అప్డేట్ వైరల్ గా మారింది.
'భగవంత్ కేసరి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. సినిమా టైటిల్ కార్డ్స్ లో ఈ విషయాన్ని రివీల్ చేశారు. అయితే ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రావడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుందట. ఈమధ్య జయాపజయాలతో సంబంధం లేకుండా మెజారిటీ సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి వస్తున్నాయి. కానీ 'భగవంత్ కేసరి' మాత్రం థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో అందుబాటులోకి రానుందట. డిసెంబర్ రెండో వారం తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ కానుందని సమాచారం.