English | Telugu

రవితేజ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌!

దసరా పండగ వస్తోంది. అంతకంటే ముందే సినిమాల పండగ రాబోతోంది. అంటే అక్టోబర్‌ 19, 20 తేదీల్లో మూడు భారీ చిత్రాలు రిలీజ్‌కి రెడీ అయ్యాయి. నందమూరి బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’, రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’, విజయ్‌ ‘లియో’ చిత్రాలు ఈ దసరాకి సందడి చేయబోతున్నాయి. ఈ మూడు సినిమాలపైన భారీ అంచనాలే ఉన్నాయి. మూడు డిఫరెంట్‌ జోనర్స్‌లో రూపొందిన ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అయ్యాయి.

‘టైగర్‌ నాగేశ్వరరావు’ రవితేజ మొదటి సారి పాన్‌ ఇంయా మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాడు. స్టూవర్ట్‌పురం దొంగగా ఎంతో పాపులర్‌ అయిన నాగేశ్వరరావు జీవిత కథను ఆధారం చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. నాగేశ్వరరావు కాస్తా టైగర్‌ నాగేశ్వరరావుగా ఎలా మారాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. రవితేజ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ రేంజ్‌లో బిజినెస్‌ జరిగిన సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’? ఈ సినిమా మొదటి రోజు రూ.5 కోట్ల వరకు కలెక్షన్స్‌ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.37.50 కోట్ల వరకు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసినట్లు సమాచారం. ఆంధ్రా ఏరియా మొత్తం 17 కోట్ల వరకు థియేట్రికల్‌ రైట్స్‌ అమ్ముడుపోగా.. సీడేడ్‌ రైట్స్‌ రూ.5 కోట్ల 40 లక్షలు, నైజాంలో రూ. 8 కోట్ల 60 లక్షల వరకు టైగర్‌ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసినట్లు తెలుస్తోంది. ఓవర్‌సీస్‌లో థియేట్రికల్‌ బిజినెస్‌ రూ. 3కోట్ల వరకు జరిగిందట. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.38 కోట్ల 50 లక్షలు. రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలకు రెట్టింపు బిజినెస్‌ ఈ సినిమా చేసిందని చెబుతున్నారు. రావణాసుర రూ.22 కోట్లు, ధమాకా రూ. 19 కోట్ల వరకు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. వాటిని ‘టైగర్‌ నాగేశ్వరరావు’ క్రాస్‌ చేసింది. రావణాసుర తొలిరోజు రూ.4.30 కోట్లు, ధమాకా రూ.4.70 కోట్లు కలెక్ట్‌ చేసాయి. ఇప్పుడు ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ఈ కలెక్షన్స్‌ను దాటేసే అవకాశం ఎక్కువగా ఉందని ట్రేడ్‌ వర్గాల అభిప్రాయం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .