English | Telugu

'ఏజెంట్ ఆనంద్ సంతోష్‌'గా మ‌న ముందుకొస్తోన్న‌ షణ్ముఖ్

ఓటిటి ప్లాట్‌ఫామ్‌ ఇప్పుడు రాజ్యమేలుతోంది. కరోనా టైంలో థియేటర్స్ అన్నీ మూతబడేసరికి ఈ ఓటిటి ప్లాట్‌ఫామ్‌కు ప్రజల నుంచి ఆదరణ విపరీతంగా పెరిగింది. ఎన్నో రకాల వెబ్ సిరీస్, కొత్త మూవీస్, టాక్ షోస్, సింగింగ్ షోస్ ఇలా ఎన్నో ఈ ఓటిటి ప్లాట్‌ఫామ్‌పై ఈజీగా చూసే ఛాన్స్ లభించింది. ఇక అందులోనూ ఆడియన్స్ ని నిత్యం ఎంటర్టైన్ చేయడానికి ఆహా ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ముందు వరుసలో నిలబడుతుంది. ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన ఆహా ఇప్పుడు మరో కొత్త వెబ్ సిరీస్ రిలీజ్ చేయడానికి సిద్ధమౌతోంది.

షణ్ముఖ్ జస్వంత్ పేరు వింటే చాలు గుర్తొచ్చేది 'సాఫ్ట్‌వేర్‌ డెవలపర్' అనే వెబ్ సిరీస్. ఇందులో షణ్ముఖ్ చాలా జనరల్ గా నటించి ఆడియన్స్ నుంచి మంచి మార్క్స్ సంపాదించుకున్నాడు. ఆ ఇమేజ్ తో బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా చోటు దక్కించుకున్నాడు. ఐతే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక షణ్ముఖ్ చాలా రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే దీప్తితో లవ్ బ్రేకప్ వంటి ఇష్యూస్ తో సైలెంట్ ఐపోయాడు. తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే షణ్ముఖ్ మళ్ళీ రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది.

సరికొత్త వెబ్ సిరీస్ తో షణ్ముఖ్ ఇప్పుడు ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. "ఏజెంట్ ఆనంద్ సంతోష్" అనే వెబ్ సిరీస్ ద్వారా తన సత్తా చాటడానికి మళ్ళీ రెడీ అయ్యాడు. అరుణ్ పవార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ను ఆహా ప్రసారం చేయడానికి సన్నద్ధమయ్యింది. ఈ విషయాన్ని ఆహా ఆఫీషియల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. షణ్ముఖ్ ఈ పోస్టర్ లో ఒక సూట్ కేసు పట్టుకుని కనిపిస్తున్నాడు. దాని మీద 'కేసు క్లోజ్డ్‌' అనే లెటర్స్ హైలైట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.