English | Telugu
రిషి ప్రేమాయణాన్ని అందరి ముందు బయటపెట్టిన సాక్షి
Updated : Jul 1, 2022
జగతి, వసు మాట్లాడుకుంటూ ఉంటారు. వసు మాత్రం రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వసు మనసు తెలుసుకున్న జగతి "నీ మనసేమిటో నీకే తెలియాలి" అంటుంది. "ఈ మధ్యనే ఒక క్లారిటీ వచ్చింది మేడం" అనేసి వెళ్ళిపోతుంది వసు. రిషి కారులో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. అభినందన సభ దగ్గర జగతి వాళ్లంతా హడావిడి చేస్తూ ఉంటారు. వసు రిషి గురించి చూస్తూ ఉంటుంది. ఇంతలో బస్తీ వాళ్లంతా ప్రోగ్రాంకి వచ్చేసరికి వాళ్ళను రిసీవ్ చేసుకుంటుంది వసు. తర్వాత వసు పెట్టిన మెసేజ్ కి రిషికి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఇంతలో గౌతమ్ ఫోన్ చేసేసరికి అతని మీద సీరియస్ ఐపోతాడు.
దేవయాని, ధరణి సభకి వస్తారు. జగతిని, మహేంద్రని ఉద్దేశించి వెటకారమాడుతుంది దేవయాని. జగతి కూడా రివర్స్ సమాధానం ఇచ్చేస్తుంది. ఇకపోతే సభని కవర్ చేయడానికి వచ్చిన రిపోర్టర్స్ తో సాక్షి మాట్లాడుతుండగా జగతి చూస్తుంది. ఆ తర్వాత దేవయానితో సాక్షి మాట్లాడుతుండగా జగతికి అనుమానం వస్తుంది. ఇంతలో అక్కడికి మినిస్టర్ రానే వస్తారు. కాసేపట్లో వసుకు స్టేజి మీద జరగబోయే అవమానాన్ని తలచుకుని హ్యాపీగా ఉంటుంది సాక్షి. వసుకి కంగ్రాట్స్ చెప్తుంది.
సభ మొదలైనా రిషి రాకపోయేసరికి ఫామిలీ మొత్తం బాధపడుతూ ఉంటుంది. సాక్షి మినిస్టర్ కి చెప్పి వీడియో ప్లే చేయిస్తుంది. అప్పుడే రిషి అక్కడికి వస్తాడు. ఆ వీడియోలో ఉన్నదంతా చూసి అక్కడి వారంతా షాక్ అవుతారు. రిషికి వసు మీద పీకల వరకు కోపం తన్నుకొస్తుంది. ఇది ఈరోజు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ అప్ డేట్స్.