English | Telugu
‘నువ్వు పెద్ద షో చేయొద్దు’ అంటూ వేణుపై ధనరాజ్ ఫైర్
Updated : Jul 2, 2022
జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ స్టేజి ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఎదిగారు. వేణు వండర్స్ కూడా మూవీస్ లో చేస్తూ బుల్లి తెర మీద అదృష్టాన్ని పరీక్షించుకుని మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. 'పార్టీ చేద్దాం పుష్ప'లో చేసిన స్కిట్ చేసాడు వేణు. ఈ ప్రోమో ఆడియన్స్ లో ఒక హైప్ ని క్రియేట్ చేసింది. టాప్ మోస్ట్ కమెడియన్స్ అంతా వచ్చి ఈ షోలో స్కిట్స్ పెర్ఫార్మ్ చేసి అలరించబోతున్నారు. ఈ షోలో ధనరాజ్ బాబా వేషంలో ఒక ఆశ్రమం నడుపుతూ ఉంటాడు. అతని దగ్గరకు వేణు వండర్స్ తన కో - ఆర్టిస్ట్ తో వచ్చి "మన్మథ రాజా మన్మథ రాజా " అనే పాటకు ఇరగదీసే స్టెప్స్ వేస్తారు. అంతలో ధనరాజ్.. వేణు మీద సడెన్ గా ఫైర్ ఐపోతాడు.
"ఆల్రెడీ ఇది షో మీరు పెద్ద షో చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నా ఆశ్రమంలో డాన్స్ చేయడం నాకు ఇష్టం లేదు.. గెటౌట్, గెటౌట్ ఫ్రమ్ మై ఆశ్రమం" అంటూ మండిపడతాడు. "మీ ఆశ్రమం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నీ స్కిట్ లాంటిదే నీ ఆశ్రమం" అంటే, "నాకు" అని వేణు కూడా ధనరాజ్ కి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత పండు, ఆరియానా వచ్చి గ్రీన్ కలర్ కాస్ట్యూమ్స్ లో "యాయాయాయా జై బాలయ్య" అనే సాంగ్ కి డాన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తారు. ఇక సుధీర్, యాదవ రాజు స్కిట్ వేస్తారు. యాదవరాజు టీ పెట్టి సుధీర్ కి ఇచ్చినప్పుడు పవర్ కట్ అవడం, అంతలోనే ఏదో జరిగిపోయిందని రాజు ఏడవడం, ఇంతలో అక్కడికి ఎక్స్‌ప్రెస్‌హరి వచ్చి అరవడం చేస్తారు. ఇక నాగబాబు కల్పించుకుని "ఇందుకేనట్రా నువ్వు అక్కడి నుంచి ఇక్కడ వచ్చావ్" అంటూ సుధీర్ కి చురకలు వేస్తారు .
"అయ్యో లేదు" అంటూ చెయ్యూపుతాడు సుధీర్. స్టేజి మొత్తం నవ్వులే నవ్వులు. యాదవ రాజు తల మీద పూలను చూసి తల మీద సుధీర్ చేయ్యిపెట్టేసరికి విగ్గు ఊడిపోతుంది. వెంటనే రాజు అక్కడినుంచి పారిపోతాడు. "ఒరే అమ్మాయి కాదు అబ్బాయా.. ఆ ఏడూ కోట్లేదో ఇస్తాను. విగ్గు పెట్టి ఆ అమ్మాయిని ఒకసారి పంపించరా మాట్లాడతాను" అంటూ హరితో కామెడీ చేస్తాడు సుధీర్. ఇలా స్కిట్స్ అన్నీ కూడా సరదా సరదాగా సాగాయి ఈ షోలో.