English | Telugu

సుడిగాలి సుధీర్ ట్రావెల్ ఏజెన్సీ 'ఊ కానీ'!


'పార్టీ చేద్దాం పుష్ప' ప్రోమో నెక్స్ట్ లెవెల్లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఫుల్ షో ఇంకా పడకముందే ప్రోమోనే హండ్రెడ్ డేస్ ఆడించేలా డిజైన్ చేశారు నిర్వాహకులు. ఇక ఇందులో అంతా కమెడియన్స్, డ్యాన్సర్లు వచ్చి చేసిన హంగామా చూస్తుంటే ఈ షో వ‌చ్చేది ఎప్పుడా అంటూ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ షో స్టార్టింగ్ లో "పార్టీ అంటే ఏ గోవాకో బ్యాంకాక్ కో వెళ్ళాలి" అంటూ అప్పారావు మంచి జోష్ మీద చెప్తూ ఉంటాడు.

"గోవా వెళ్లాలన్నా, బ్యాంకాక్ వెళ్లాలన్నా మనకు ఒక గైడ్ కావాలి" అంటాడు ధనరాజ్ . అలా అనేసరికి "మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్" అంటూ ఒక బ్యాగ్రౌండ్‌ వాయిస్ వినిపిస్తుంది. ఇక వెంటనే "తుఫాన్ తుఫాన్" అనే సాంగ్ ప్లే అవుతుంటే బ్లాక్ కలర్ డ్రెస్ లో బుల్లి తెర హీరో సుధీర్ ఎంట్రీ ఇస్తాడు.

తర్వాత సుధీర్ దగ్గరకు ధనరాజ్ వచ్చి 'మీకో ట్రావెల్ ఏజెన్సీ ఉందని చెప్పారు' అంటాడు. 'ఆ ఉందండి 'అంటాడు సుధీర్. 'ఆ ఏజెన్సీ పేరేమిటి?' అని అడుగుతాడు ధనరాజ్. "ఊ కానీ" అనేది త‌మ‌ ట్రావెల్ ఏజెన్సీ పేరు అని చెప్తాడు. అర్థం కానట్టు చూస్తాడు ధనరాజ్. "అసలా పేరు ఎందుకు పెట్టావయ్యా?" అని సుధీర్ ని ప్రశ్నిస్తాడు ధనరాజ్. "అంటే మన ట్రావెల్ ఏజెన్సీకి ఎండింగ్ అనేది ఉండదు సర్.. డే టైం కానీ, నైట్ టైం కానీ, ఎనీవేర్, ఎనీ టైం, ఎనీ ప్లేస్ ఊ కానీ, ఊ కానీ" అని సుధీర్ చెప్పేసరికి "నువ్ కానిచ్చుకోవయ్యా బాబు" అంటూ ధనరాజ్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

ఇప్పుడు ఈ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుధీర్ అన్న ఉంటె షో నెక్స్ట్ లెవెల్ , సుధీర్ అన్న నువ్వు ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు, సుధీర్ అన్న స్టైల్ సూపర్బ్, సుధీర్ లేనిదే షో నడవదు అంటూ సుధీర్ ఫాన్స్ అంతా ఈ ప్రోమోకి మెసేజీల వరద కురిపిస్తున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.