English | Telugu

 ఆ రోజు నుంచే జోర్దార్ సుజాత మాయ‌లో ప‌డ్డాడ‌ట!

జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలని టీమ్ లీడ‌ర్లు ఒక్కొక్క‌రుగా వీడుతున్నా మిగ‌తా వాళ్లు షోని హిట్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆటో రాంప్ర‌సాద్‌, రాకింగ్ రాకేష్‌, ఇమ్మానుయేల్, బుల్లెట్ భాస్క‌ర్ వంటి వారు త‌మ టీమ్ ల‌తో షోని నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌మ‌దైన స్కిట్ ల‌తో ఆకట్టుకుంటున్నారు. ఇక ప్ర‌తి శుక్ర‌వారం ప్ర‌సారం అవుతున్న ఈ షో కోసం టీమ్ లీడ‌ర్లు కొత్త కాన్సెప్ట్ ల‌తో వ‌స్తూ అద‌ర‌గొడుతున్నారు. ఈ షో నుంచి సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను వంటి వాళ్లు వెళ్లిపోవ‌డంతో ఉన్న వాళ్లే ప్రేక్ష‌కుల్ని న‌వ్వించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇక సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, ఆటో రాంప్ర‌సాద్ ల త‌రువాత ఈ షోలో కంటిన్యూ అవుతున్న రాకింగ్ రాకేష్ కూడా సీనియ‌రే. దీంతో త‌న వంతు బాధ్య‌త‌గా షోని మ‌రింత బాధ్య‌త‌గా ర‌క్తిక‌ట్టించేందుకు త‌న వంత ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. జోర్దార్ సుజాత‌తో క‌లిసి న‌వ్విస్తున్నాడు. వీళ్లిద్ద‌రి మ‌ధ్య సాగుతున్న ల‌వ్ స్టోరీ కూడా ఈ షోకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తూ ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు.

జాక్‌గారాకింగ్ రాకేష్‌, రోస్‌గా సుజాత క‌నిపించి న‌వ్వులు పూయిస్తున్నారు. వీరిద్ద‌రు క‌లిసి టైటానిక్ స్ఫూఫ్ తో అల‌రించారు. షిప్ కెప్టెన్ తో వీరిద్ద‌రూ చేసే సంభాష‌ణ న‌వ్వులు పూయిస్తోంది. టైటానిక్ షిప్ హైద‌రాబాద్ లో అమీర్ పేట్‌, పంజాగుట్ట అన్ని ప్రాంతాలు తిరుగుతుంద‌ని చెప్ప‌డం న‌వ్వులు పూయించే విధంగా వుంది. రియ‌ల్ లైఫ్ ల‌వ్ జోడీ ఐన రాకేష్‌, సుజా మ‌ధ్య‌లో ప్రేమ గురించి చెప్పే మాట‌లు ఆస‌క్తికంగా ఉన్నాయి. ఓవ‌రాల్ గా ఈ స్కిట్ బాగా ఆక‌ట్టుకుంది. ఈ స్కిట్ పై ఇంద్ర‌జ ప్ర‌శంస‌లు కురిపించింది.

స్కిట్ పూర్త‌య్యాక సుజాత‌తో త‌న రియ‌ల్ లైఫ్ ల‌వ్ స్టోరీ ఎలా మొద‌లైందో వివ‌రించాడు రాకింగ్ రాకేష్‌. ఓ రోజు సుజాత ప‌ని చేసే ఛాన‌ల్ కి ఇంట‌ర్వ్యూ కోసం వెళితే అక్క‌డే ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం మొద‌లైంద‌ట‌. ఆ రోజు నుంచే జోర్దార్ సుజాత మాయ‌లో ప‌డ్డాడ‌ట. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.