English | Telugu
మల్లెమాల చెక్కుల కోసం అబద్దాలు చెప్పొద్దు
Updated : Jul 1, 2022
శ్రీదేవి డ్రామా కంపెనీ 75 వ ఎపిసోడ్ ప్రోమో పంచ్ డైలాగ్స్ తో జోరు మీద ఉంది. ఈ షోలో ఆది పుష్ప క్యారెక్టర్ చేస్తే అన్నపూర్ణ శ్రీవల్లి క్యారెక్టర్ లో అలరించారు. "పుష్ప నేను శ్రీవల్లిని... తగ్గేదెలా అంటూ అన్నపుర్ణమ్మ లంగా వోణిలో"లో డైలాగ్ చెప్తే "ఏంటి ఆయాసమా" అంటాడు ఆది. శ్రీవల్లి ఒక ముద్దెమన్నా ఇత్తావ అని ఆది అనేసరికి "ఇదిగో అన్నో నేనొచ్చి ఇచ్చేదా ముద్దు " అంటూ వర్ష మధ్యలో ఎంట్రీ ఇస్తుంది. అన్న అంటది, ముద్దితానంటది ఇది పుష్ప ఇల్లా , అమ్మమ్మ గారిల్లా అంటాడు ఆది. మధ్యలో అన్నపూర్ణ వచ్చి "అప్పటినుంచి ఇప్పటివరకు నా అందం చెక్కుచెదరలేదు తెల్సా" అంటుంది.
"మల్లెమాల చెక్కుల కోసం ఇలాంటి మాటలు చెప్పడానికి నీకేమైనా మనసు ఉందా" అంటూ నవ్విస్తాడు ఆది. తర్వాత గీతాసింగ్, శ్రీవాణి, హరిత స్టేజి మీదకు వచ్చి "ఆగేదెట్టాగా, అందాక యేగేదెట్టాగా" అనే పాటకు మస్త్ డాన్స్ చేస్తారు. ఇక పూర్ణ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ అంటూ కామెంట్ చేస్తుంది. ఇలా ఈ షో త్వరలో ప్రసారం కానుంది. ఇక ఈ షోకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మంచి ఆదరణ అనేది లభిస్తోంది. వ్యూయర్ షిప్ లో కూడా ఈ షో టాప్ ప్లేస్ దూసుకుపోతోంది.