English | Telugu
నిరుపమ్ కి హ్యాపీ డాక్టర్ బాబు డే అని చెప్తున్న అభిమానులు
Updated : Jul 1, 2022
ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఎంతో మంది డాక్టర్స్ ఈ రోజు విషెస్ అందుకున్నారు. ఇక ఆన్ స్క్రీన్ డాక్టర్ ఐన నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు కూడా శుభాకాంక్షలు అందుకుంటున్నాడు. రియల్ లైఫ్ లోను, రీల్ లైఫ్ లోనూ ఒక్క సర్జరీ కూడా చేయని నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబుకి ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్ పేజీ మాత్రం డాక్టర్స్ డే విషెస్ చెపింది. నిరుపమ్ మంజుల ఇన్స్టా పేజీలో దీన్ని షేర్ కూడా చేసాడు. అభిమానులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాడు డాక్టర్ బాబు. కార్తీకదీపంలో నిరుపమ్ డాక్టర్ బాబుగా ఆడియన్స్ మనసులను కొల్లగొట్టాడు. అసలు పేరు పక్కకు పోయి డాక్టర్ బాబుగా మారిపోయాడు.
ఈ సీరియల్ లో ఫేమస్ కార్డియాలజిస్ట్ పాత్రలో నటించాడు. బుల్లి తెర చరిత్రలో ఆన్ స్క్రీన్ మీద కేవలం డాక్టర్ గా నటించి ఎంతోమందికి ఆరాధ్య డాక్టర్ గా మారాడు నిరుపమ్. ఇక ఈ సీరియల్ లో కార్తీక, సహృద, ప్రేమి విశ్వనాధ్, నిరుపమ్ ఒక ఫామిలీగా నటించారు. ఎంతో మందికి ఫ్రీగా వైద్యం చేస్తూ గొప్ప డాక్టర్ గా పేరు సంపాదించుకుంటాడు. నిరుపమ్ నటించిన ఏ సీరియల్ లోని క్యారెక్టర్ కి రాని పేరు ప్రఖ్యాతలు మాత్రం ఈ సీరియల్ లోని క్యారెక్టర్ కి వచ్చాయి. ఇక బ్రహ్మి స్టేటస్ లో హ్యాపీ డాక్టర్ డాక్టర్ బాబు డే అంటూ పెట్టిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.