English | Telugu

ఆది ప్రేమను రిజెక్ట్ చేసిన ఇషా!

బుల్లి తెర మీద పంచ్ డైలాగ్స్ కి ప్రాణం పోసి ఎదిగిన కమెడియన్స్ లో హైపర్ ఆది పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇక ఈ బుల్లితెర మీద ఒక్కొక్కరి ప్రేమ వ్యవహారాలూ, పెళ్లి విషయాలపై ఎప్పుడూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇక ఆది కూడా ఇప్పుడు ఆ కోవలోకి వెళ్ళిపోయాడు. ఆది ఇప్పటికే ఎంతోమందితో ప్రేమలో ఉన్నట్లు చెప్పుకుంటూ వచ్చాడు. వర్షిణితో ప్రేమాయణం అని, పెళ్లి అని ఒకసారి.. తరువాత చుట్టాలమ్మాయిని వివాహం చేసుకుంటున్నట్లు మరోసారి, రీసెంట్ గా ఒక షోలో ఈమె నా భార్య అంటూ ఒక అమ్మాయిని ముగ్గురు పిల్లల్ని పరిచయం చేసాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇషా చావ్లా వెంట పడడం స్టార్ట్ చేసాడు ఆది. 11 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నానని చెప్పి 11 గిఫ్టులు కూడా ఇచ్చేసాడు.

వీటితో పాటు అదనంగా కొన్ని క‌వితల్ని కూడా తన రైటర్ స్టైల్ లో రాసి మరీ ఆమె కోసం చెప్పాడు. "ఏరా ఈషా నువ్ నటించిన మూవీ 'ప్రేమ కావాలి' వచ్చి పదకొండేళ్ళ అయ్యింది. అప్పటినుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను" అంటూ స్టేజి మీదే తన లవ్ ని ప్రొపోజ్ చేసేసాడు. అలాగే "జీవితాంతం నా పక్కనే ఉండాలి నువ్వు" అంటూ బాండ్ పేపర్స్ ఇచ్చి సంతకం చేయించేలా ప్లాన్ చేసాడు ఆది. చివరికి ఇషా స్టేజి మీదకు వచ్చి "గిఫ్ట్స్ అన్నీ నచ్చాయి కానీ ఒక్క గిఫ్ట్ మాత్రం ఇవ్వడం మర్చిపోయాడు. గిఫ్ట్స్ ఎంపికలో పడి తనని తానే నాకు ప్రొపోజ్ చేయడం మర్చిపోయాడు" అంటుంది. "అది నా తప్పు కాదు.. సర్లే అయిందేదో అయ్యింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం" అంటూ 'ఇష్టమైన సఖుడా' అనే పాటకు జోడి డాన్స్ వేసి వెళ్ళిపోయింది ఇషా. ఇక ఈ షోలో ఇలా ఇషా కూడా హ్యాండ్ ఇచ్చేసరికి "పోయే పోయే లవ్వే పోయే" అంటూ బాధపడ్డాడు ఆది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.