English | Telugu

బిగ్ స్టార్ సినిమా మళ్ళీ వాయిదా.. ఇక ఓటీటీనే గతా?

చిన్న సినిమాలు వాయిదాల మీద వాయిదా పడుతూ విడుదలకు నోచుకోకపోవడం సహజం. అయితే ఓ స్టార్ హీరో నటించిన సినిమా ఆరేళ్లుగా విడుదలకు నోచుకోవడం లేదు. అదే 'ధృవ నక్షత్రం'. కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ గౌత‌మ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో 2017లో విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ పోన్ అవుతూ 2023, నవంబర్ 24కి వచ్చింది. ఎట్టకేలకు విడుదలవుతుంది అనుకుంటే రిలీజ్ కి కొన్ని గంటల ముందు మళ్ళీ వాయిదా పడిందనే వార్త ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తోంది.

ధృవ నక్షత్రం సినిమాని ముందు నుంచి దురదృష్టం వెంటాడుతుంది. నిజానికి సినిమా 2013 లోనే ప్రారంభమైంది. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ నిలిచిపోయింది. 2016-17 ప్రాంతంలో తిరిగి షూటింగ్ ప్రారంభించారు. మొదట ఈ సినిమాని 2017 ఆగస్టులో విడుదల చేయాలి అనుకున్నారు. కానీ షూటింగ్ లో జరిగిన ఆలస్యం కారణంగా 2018 ఏప్రిల్ కి వాయిదా పడింది. అప్పటి నుంచి తేదీలు మారుతున్నాయి కానీ సినిమా మాత్రం విడుదల కాలేదు. 2018 నుంచి 2022 వరకు ప్రతి సంవత్సరం కొత్త విడుదల తేదీని ప్రకటించడం, ఆ తేదీకి సినిమా రాకపోవడం మామూలైపోయింది. ఇప్పుడు 2023లో కూడా అదే తంతు. మే, జులై, అక్టోబర్ అంటూ నెలలు మార్చుకుంటూ వచ్చి.. ఫైనల్ గా నవంబర్ 24 అన్నారు. ఇప్పుడు ఈ తేదీకి కూడా రావడంలేదు. కొన్నేళ్ల క్రితం నాటి సినిమా కావడం, ఇన్నిసార్లు వాయిదా పడటంతో 'ధృవ నక్షత్రం'పై అసలు బజ్ లేదు. కనీసం ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించట్లేదు. అందుకే వాయిదా వేసినట్లున్నారు. చివరికి ఈ సినిమాని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.