English | Telugu

పొలిమేర బాటలో ప్రియమణి.. పెద్ద ప్లానే ఇది!

నేరుగా ఓటీటీలో విడుదలై హిట్ అయితే, ఆ సినిమా సీక్వెల్ ని థియేటర్లలో విడుదల చేయడం ఈమధ్య ట్రెండ్ గా మారింది. 'మా ఊరి పొలిమేర' సినిమా విషయంలో అదే జరిగింది. మొదటి భాగం నేరుగా ఓటీటీలో విడుదలై ఆకట్టుకోగా, ఇటీవల రెండో భాగాన్ని థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పుడు ఇదే బాటలో మరో చిత్రం పయనిస్తోంది.

ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ మూవీ ఓటీటీ వేదిక ఆహాలో సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ దీనికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘భామా కలాపం 2’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. క్రియేటివ్ గా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

'భామాకలాపం’, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో రెండు వరుస సక్సెస్‌లను సొంతం చేసుకున్న డ్రీమ్ ఫార్మర్స్ ‘భామా కలాపం 2’ని నిర్మిస్తోంది. డ్రీమ్ ఫార్మర్స్‌తొో పాటు ఆహా స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తోన్న ఈ సినిమాలో శీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అభిమన్యు తాడిమేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.