English | Telugu

బాలయ్య ఆ నటిని రూమ్ కి రమ్మన్నాడా.. అసలేం జరిగింది?

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ ఎదుర్కున్నన్ని ట్రోల్స్ ఏ హీరో ఎదుర్కోలేదు. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' వంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత బాలయ్య పలు పరాజయాలు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో ఒక వర్గం పనిగట్టుకొని బాలయ్య మీద ఫన్నీ జోక్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేసేది. అయినప్పటికీ నటసింహం ఎప్పుడూ ఎవరినీ నిందించలేదు. అలాగే వారిని కొట్టాడు, వీరిని కొట్టాడు.. ఆఖరికి హీరో రవితేజను కూడా కొట్టాడంటూ అప్పట్లో కొందరు ఆయనపై తప్పుడు ప్రచారం చేపించారు. అయితే అన్ స్టాపబుల్ షో సమయంలో బాలయ్య, రవితేజ మధ్య బాండింగ్ చూసి అవన్నీ తప్పుడు వార్తలని అందరికీ అర్థమైపోయింది. ఇలా బాలకృష్ణ మీద గత పది ఇరవై ఏళ్ళలో ఎన్నో తప్పుడు ప్రచారాలు జరిగాయి. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్యపై తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు.

తమిళ నటి విచిత్ర ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్ గా ఉంది. అయితే ఈ షోలో ఆమె మాట్లాడుతూ.. 20 ఏళ్ళ క్రితం ఓ సినిమా షూటింగ్ సమయంలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. 2000-2001 సమయంలో ఒక సినిమా చేస్తున్నప్పుడు తను ఇబ్బందులు పడినట్లు చెప్పింది. షూటింగ్ సమయంలో ఒక హోటల్ లో ఉండగా, ఆ సినిమా హీరో తన గదికి రమ్మన్నాడని, తాను వెళ్ళకపోవడంతో తనపై కోపం పెంచుకున్న హీరో తర్వాత ఇబ్బందులకు గురి చేశాడని చెప్పుకొచ్చింది.

నిజానికి విచిత్ర ఎక్కడా సినిమా పేరు కానీ, హీరో పేరు కానీ చెప్పలేదు. అయితే ఆమె 2001 సమయంలో నటించిన సినిమాల్లో 'భలేవాడివి బాసు' కూడా ఉంది. ఇందులో బాలకృష్ణ హీరోగా నటించగా, పుష్ప అనే ఒక పాత్రలో విచిత్ర నటించింది. దాంతో ఆమెని ఇబ్బంది పెట్టిన హీరో బాలకృష్ణనే అంటూ కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు.

బాలయ్య ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అన్ స్టాపబుల్ షోతో ఆయన కొత్తగా మరెందరో అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. అందుకే బాలయ్య మీద పనిగట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .