English | Telugu
శ్రీజతో ఘనంగా మానస్ పెళ్లి.. ప్రత్యేక ఆకర్షణగా రోజా!
Updated : Nov 23, 2023
బుల్లితెర నటుడు, బిగ్ బాస్ ఫేమ్ మానస్ పెళ్లి ఘనంగా జరిగింది. తన దగ్గరి బంధువు అయిన శ్రీజతో సెప్టెంబర్ 2న మానస్ ఎంగేంజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. నిన్న(నవంబర్ 22) శ్రీజ మెడలో మూడు ముళ్ళు వేశాడు మానస్. విజయవాడలో వైభవంగా జరిగిన ఈ వేడుకకు సీనియర్ నటి, ఏపీ మంత్రి రోజాతో పాటు పలువురు నటీనటులు హాజరయ్యారు. మానస్ పెళ్ళికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొందరు పెళ్ళికి హాజరవ్వగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.
మానస్ పలు సీరియల్స్, సినిమాల్లో నటించాడు. బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చాక అతనికి మరింత గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం స్టార్ మా టీవీలో సీరియల్ లో రాజ్ పాత్రలో మెప్పిస్తున్నాడు. ఒకవైపు సీరియల్, మరొకవైపు ప్రైవేట్ ఆల్బమ్స్ తో బిజీ గా ఉన్నాడు. అతను చేసిన 'జరి జరి పంచే కట్టు', 'గంగులు' పాటలకి యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి.