English | Telugu

బన్నీ నెక్స్ట్ మూవీ మారింది.. త్రివిక్రమ్ ప్లేస్ లో బోయపాటి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప-2'తో బిజీగా ఉన్నాడు. 'పుష్ప-1'తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న బన్నీ, పార్ట్-2 తో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి. దీని తర్వాత ఐకాన్ స్టార్ చేసే సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో కూడిన పాన్ ఇండియా సినిమాలు ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఇప్పటికే బన్నీ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రకటించాడు. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' వంటి విజయవంతమైన చిత్రాల తరవాత వీరి కాంబినేషన్ లో రానున్న సినిమా కావడంతో ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆలస్యం కానుందనే వార్త ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం 'గుంటూరు కారం'తో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. అది పూర్తి కాగానే బన్నీ ప్రాజెక్ట్ పైకి షిఫ్ట్ కానున్నాడు. అయితే ఇది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్. దీని ప్రీ ప్రొడక్షన్ కే ఏడాదిన్నరకు పైగా సమయం పడుతుందట. అందుకే ఈ గ్యాప్ లో బన్నీ మరో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఈ విషయాన్ని బన్నీ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాసు చెప్పడం విశేషం. 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వాసు ఈ విషయాన్ని చెప్పాడు.

దర్శకుడు బోయపాటి శ్రీను గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా కమిటై ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ లేదా సూర్య హీరోగా నటించే అవకాశముందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన వాసు.. "బోయపాటి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. బన్నీ ఓకే అంటే వెంటనే మొదలవుతుంది" అన్నాడు. మరి త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సంగతేంటి అనగా.. "అది చాలా పెద్ద ప్రాజెక్ట్. ప్రీ ప్రొడక్షన్ కే ఏడాదిన్నర సమయం పడుతుంది. అన్నీ కుదిరితే ఈలోపు బోయపాటి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది" అని చెప్పాడు వాసు.

బన్నీ-బోయపాటి కాంబోలో గతంలో 'సరైనోడు' వంటి విజయవంతమైన చిత్రం వచ్చింది. అయితే ఇప్పుడు బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. మరోవైపు బోయపాటి ఏమో ఇటీవల 'స్కంద'తో పాన్ ఇండియా ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. మరి ఇప్పుడు బన్నీ కోసం బోయపాటి ఎలాంటి కథని సిద్ధం చేస్తాడో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.