English | Telugu
ఓటీటీలో 'భగవంత్ కేసరి' సందడి షురూ!
Updated : Nov 23, 2023
నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి, భారీ వసూళ్లతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.
'భగవంత్ కేసరి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ చిత్రం శుక్రవారం(నవంబర్ 24) నుంచి ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. అంటే ఈ అర్ధరాత్రి 12 నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లలో సంచలన వసూళ్లతో సత్తా చాటిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి. థియేటర్లలో మిస్ అయిన కుటుంబ ప్రేక్షకులు ఓటీటీలో బ్రహ్మరథం పట్టే అవకాశముంది.