English | Telugu
‘సలార్’ ట్రైలర్‌కి 100 మిలియన్ వ్యూస్. ప్రభాస్ రికార్డుల వేట మొదలైంది!
Updated : Dec 2, 2023
దేశవ్యాప్తంగా ఇప్పుడు ‘సలార్’ ఫీవర్ నడుస్తోంది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘సలార్’ ట్రైలర్ రానే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ట్రైలర్‌కి వచ్చిన వ్యూస్‌ని బట్టి అర్థమవుతోంది. రెబల్‌స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టే చిత్రాన్ని ఎంతో లావిష్‌గా చిత్రీకరిస్తున్నాడు ప్రశాంత్ నీల్. గురువారం సాయంత్రం గం. 7.19లకు విడుదలైన ‘సలార్’ ట్రైలర్ నిమిషాల్లోనే లక్షల వ్యూస్‌కు చేరుకుంది. 24 గంటలు కూడా గడవక ముందే అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. దీన్నిబట్టి ఈ కాంబినేషన్‌కి, ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది.
‘బాహుబలి’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రెబల్‌స్టార్ ప్రభాస్, ‘కెజిఎఫ్’ సిరీస్‌తో వరల్డ్‌వైడ్‌గా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే మూవీ లవర్స్‌కి పండగే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అందరూ వేయికళ్లతో ఎదురుచూశారు. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 22కి వాయిదా పడిరది. ఈ డేట్‌కి కూడా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని, సమ్మర్‌కి పోస్ట్ పోన్ అయ్యిందంటూ ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే అదేమీ నిజం కాదని ట్రైలర్‌ని రిలీజ్ చేసి ప్రూవ్ చేసారు మేకర్స్. ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమా ట్రైలర్‌తోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. మరి డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.