English | Telugu
వాళ్ళకి సంబంధించిన సీక్రెట్ ని బయటపెట్టిన దిల్ రాజు
Updated : Dec 2, 2023
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెలుగు చిత్ర సీమకి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించిన నిర్మాత దిల్ రాజు. హీరోని ,హీరోయిన్ ని, దర్శకుడు ని చూసి సినిమాకి వెళ్లే ప్రేక్షకులని నిర్మాతని చూసి కూడా థియేటర్స్ కి వెళ్లేలా చేసింది దిల్ రాజు నే అని చెప్పవచ్చు.అలాగే ప్రస్తుత రోజుల్లో నిర్మాతకి గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి కూడా ఆయనే. తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో మంది కొత్త దర్శకులని పరిచయం చేసిన దిల్ రాజు పంపణీదారుడుగా మారి ఎన్నో మంచి చిత్రాలని తెలుగు ప్రేక్షకులకి అందించాడు. తాజాగా ఆయన తన డిస్టిబ్యూటర్ల గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం థియేటర్స్ దగ్గర రికార్డు కలెక్షన్స్ ని సాధిస్తున్న అనిమల్ మూవీతో పాటు బింబిసార, పొన్నియన్ సెల్వం ,జైలర్ ,దసరా, లవ్ టుడే, మాసూద లాంటి పలు చిత్రాలన్నింటిని దిల్ రాజు నే రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణి చేసారు. ఈ సినిమాలన్నీ కూడా తన డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు తెచ్చిపెట్టాయని అందుకు తనకి చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు చెప్పాడు. అలాగే ఆ సినిమాలని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కూడా దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు . ఇక ముందు కూడా మంచి చిత్రాల్ని అందిస్తానని కూడా ఆయన చెప్పాడు.
దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.రామ్ చరణ్ ,విజయ్ దేవరకొండ లాంటి హీరో ల చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. అలాగే ఇంకొన్ని చిత్రాల పంపిణి హక్కులని కూడా ఆయన పొందటం జరిగింది.