English | Telugu
నందమూరి బాలకృష్ణ @ 2 సంవత్సరాలు
Updated : Dec 2, 2023
నందమూరి బాలకృష్ణ ఈ పేరు చెప్తే పులకరించిపోని తెలుగువాడు ఉండడు. తెలుగు సినిమా కథ యొక్క రూపురేఖల్లో ఎన్ని మార్పులు వచ్చినా సరే నేటికీ తెలుగు నేటివిటితో సినిమాలు తీసే హీరో బాలకృష్ణ. అలాగే బాలయ్యని రికార్డులకి రారాజుగా కూడా అయన అభిమానులు పిలుచుకుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బాలయ్య సృష్టించిన ఎన్నో రికార్డులు నేటికీ ఆయన పేరు మీద చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి సంబంధించిన ఒక తాజా వార్త టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
బాలకృష్ణ ద్విపాత్రాభినయం పోషించిన చిత్రం అఖండ. ఈ చిత్రం 2021 డిసెంబర్ 2 న విడుదల అయ్యింది. అంటే నేటికీ అఖండ వచ్చి సరిగ్గా రెండు సంవత్సరాలు అవుతుంది. కరోనా కొంచం తగ్గుముఖం పట్టిన తర్వాత అసలు జనాలు సినిమా లకి వస్తారా రారా అనే డౌట్ లో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తెలుగు సినిమా 20 రోజులకి 30 రోజులకి మాత్రమే పరిమితమైన వేళ అఖండ 103 సెంటర్స్ లో 50 రోజులు జరుపుకొని టోటల్ రన్ లో 130 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఆదోని ,ఎమ్మిగనూరు ,చిలకలూరి పేట ,కోయిల కుంట్ల లాంటి కేంద్రాల్లో శతదినోత్సవాన్ని కూడా జరుపుకుంది.
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ మూవీ అంతటి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం బాలయ్య పండించిన పెరఫార్మెన్సె అని ప్రతి ఒక్కరు ఒప్పుకునే నిజం. అఘోరాగా, ప్రజల మంచి కోరుకునే సోషల్ వర్కర్ గా ఇలా రెండు కేరక్టర్స్ లో బాలయ్య నటన నభూతో నభవిష్యత్తు అనే విధంగా ఉంటుంది. మరి ముఖ్యంగా అఘోరా క్యారక్టర్ లో బాలయ్య నటనకి డైలాగ్స్ కి ప్రేక్షకులు మొత్తం పూనకాలు వచ్చిన వాళ్ళల్లా ఊగిపోయారు.ఆయన నోటి వెంట వచ్చిన ఒక్కో డైలాగ్ ఒక అణుబాంబు లాగా పేలింది. ఇంకో ఇరవై సంవత్సరాలు వచ్చిన సరే అఖండ మూవీ ప్రేక్షకుల గుండెల్లో చెక్కు చెదరకుండా ఉండిపోతుందనేది వాస్తవం.