English | Telugu
నా భర్త నుంచి విడిపోతున్నాను..ప్రముఖ నటి వెల్లడి
Updated : Dec 2, 2023
షీలా రాజ్ కుమార్..తమిళ చిత్ర పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది. 2016 లో వచ్చిన ఆరతు సైనం అనే మూవీతో చిత్ర రంగ ప్రవేశం చేసిన షీలా ఆ తర్వాత టూలెట్, మనుసంగదా, అసురవధం,నమ్మ వెట్టు పిళ్ళై ,ద్రౌపతి ,మండేలా, బిచ్చగాడు 2 లాంటి ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా నటించి ఎంతో మంది తమిళ ప్రేక్షకులని తన నటనతో ఆకట్టుకుంది. తాజాగా ఆమెకి సంబంధించిన న్యూస్ ఒకటి తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది.
షీలా రాజ్ కుమార్ కి కొన్నేళ్ల క్రితం నటనకి సంబంధించి శిక్షణ ఇచ్చే చోళన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కొంత కాలం క్రితం వరకు వాళ్ళిద్దరి దాంపత్యం అన్యోన్యంగానే సాగింది .ఇప్పుడు ఏమైందో తెలియదు గాని షీలా తన ట్విట్టర్ ద్వారా చోళన్ నుంచి విడిపోతున్నట్టుగా ప్రకటించింది.ఈ సందర్భంగా షీలా చోళన్ కి థాంక్స్ చెప్పడం గమనార్హం.
షీలా ఇటీవలే లారెన్స్ ,ఎస్ .జె సూర్య ల కాంబినేషన్ లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో వచ్చిన జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీలో ఎస్ .జె సూర్య లవర్ గా నటించి మంచి మార్కులనే పొందింది. ఇకపోతే షీలా ఎందుకు విడాకులు తీసుకుంటున్నదనే విషయంలో మాత్రం తమిళ చిత్ర పరిశ్రమలో రకరకాల మాటలు వినపడుతున్నాయి. కొన్ని రోజులు ఆగితే కానీ అసలు విషయాలు బయటకి రావు.