English | Telugu

బృందా మాస్టర్ కు ప్రమాదం!

ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ కు ప్రమాదం జరిగింది. న్యూజిలాండ్‌ లో 'కన్నప్ప' సినిమాలోని ఒక పాట చిత్రీకరణ సమయంలో ఆమె కాలికి గాయమైంది. దీంతో మేకర్స్ షూటింగ్ ని వాయిదా వేశారు.

మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్‌ లో జరుగుతోంది. ఈ క్రమంలో కన్నప్ప కోసం ఓ పాటను షూట్ చేస్తున్నప్పుడు కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ కాలు ఫ్రాక్చర్ అయింది. ఈ ఘటన ఆదివారం జరిగింది. మేకర్స్ ఈ పాట షూటింగ్‌ ని ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంచారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.