English | Telugu

పాన్ ఇండియా మూవీ.. రవితేజ స్థానంలో బాలీవుడ్ స్టార్!

'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని నాలుగోసారి చేతులు కలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందించాలని ప్లాన్ చేశారు. అయితే రవితేజకు పాన్ ఇండియా మార్కెట్ లేదు. ఆయన మార్కెట్ తో పోలిస్తే సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుండటంతో.. మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కి బ్రేకులు వేశారు. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ లోకి రవితేజ స్థానంలో బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది 'గదర్ 2'తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు సన్నీ డియోల్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. దీంతో సన్నీతో సినిమా చేయడానికి నార్త్, సౌత్ అనే తేడా లేకుండా పలు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఉందని అంటున్నారు. రవితేజతో తీయాలనుకున్న కథని సన్నీతో చేస్తే బాగుంటుందని మలినేని సూచించగా, మైత్రి మేకర్స్ వెంటనే ఓకే చెప్పారట. అంతేకాదు ఇప్పటికే మలినేని వెళ్లి కథ చెప్పడం, అది సన్నీకి నచ్చడం జరిగిపోయాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు. అదే నిజమైతే తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి ఏర్పడుతుంది అనడంలో సందేహం లేదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.