English | Telugu

ఆ హోటల్ కి విక్టరీ వెంకటేష్ వెళ్ళింది అందుకేనంట 

విక్టర్ వెంకటేష్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రేస్టీజియస్ట్ మూవీ సైంధవ్‌.. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ వేగవంతం చేసారు. అందులో భాగంగా వెంకటేష్, హీరోయిన్ శ్రద్ద శ్రీనాధ్ అండ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ రోజు విజయవాడ వెళ్లారు. ఈ సందర్భంగా వెంకటేష్ విజయవాడలో ఒక చోటుకి వెళ్లి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.

వెంకటేష్ ఈ రోజు విజయవాడ లో బాగా ఫేమస్ హోటల్ అయిన బాబాయ్ హోటల్ ని సందర్శించాడు. తనకిష్టమైన ఐటమ్స్ ని తెప్పించుకొని కడుపునిండా తిన్నాడు.వెంకటేష్ తో పాటు శ్రద్ద శ్రీనాధ్ , శైలేష్ కొలను లు కూడా హోటల్ ని సందర్శించిన వాళ్ళల్లో ఉన్నారు. అలాగే బాబాయ్ హోటల్ కి వచ్చే ముందే వెంకటేష్ కనకదుర్గమ్మ కొండకెళ్లి అమ్మ వారిని దర్శనం చేసుకున్నాడు.ప్రత్యేక పూజలు నిర్వహించి తన సైంధవ్‌ సినిమా హిట్ కావాలని కోరుకున్నాడు.. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి వెంకటేష్ కి ఆయనతో పాటు ఉన్న వారికి తీర్ధ ప్రసాదాలు అందచేశారు. వెంకటేష్ వస్తున్నారని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ ఉదయం నుంచే గుడి దగ్గర,బాబాయ్ హోటల్ దగ్గర క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి తొక్కిసిలాట జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు.అలాగే వెంకటేష్ కొంత మంది తమ అభిమానులతో సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

వెంకటేష్ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న సైంధవ్‌ మీద వెంకటేష్ అభిమానుల్లోను ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. హిట్ చిత్రం సిరీస్ తర్వాత శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని నిహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి, ఆర్య ,రుహనీ శర్మ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .