English | Telugu

రమణగాడిని ఆ బేబీ ఎంతగా టచ్ చేస్తుందో ఎల్లుండి  చెప్తా అంటున్న మహేష్ బాబు 

ప్రిన్స్ మహేష్ బాబు వన్ మాన్ షో గుంటూరు కారం విడుదలకి టైం దగ్గర పడే కొద్దీ మూవీలో దాగి ఉన్నఒక్కో అధ్బుతాన్ని మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ తో ప్రారంభమయిన ఆ అధ్బుతాల హంగామ దమ్ మసాల సాంగ్ తో పీక్ లోకి వెళ్ళింది. ఇప్పుడు కేవలం రెండే రెండు రోజుల్లో గుంటూరు కారం నుంచి ఇంకో సాంగ్ విడుదల కాబోతుంది. కొద్దీ సేపటి క్రితం ఆ సాంగ్ కి సంబంధించిన ప్రోమో ని వీడియో రూపంలో విడుదల కావడం జరిగింది.

గుంటూరు కారం నుంచి ఓ మై బేబీ అనే లిరిక్ తో కూడిన సాంగ్ ప్రోమో విడుదల అయ్యింది. మహేష్ బాబు శ్రీలీలని అమ్ము అని పిలవగానే శ్రీలీల వెనక్కి తిరుగుతుంది. అప్పుడు మహేష్ శ్రీలీలతో ఈ రమణ గాడ్ని గుర్తెట్టుకో రేపు గుంటూరు వచ్చినప్పుడు పనికొస్తుందని పక్కా గుంటూరు స్టైల్లో చెప్తాడు. ఆ తర్వాత ఓ మై బేబీ పాట స్టార్ట్ అయ్యింది. నిమిషం వ్యవధి కూడా లేని ఈ సాంగ్ ప్రోమో ఉన్నంతసేపు కూడా అలాగే చూస్తుండాలనిపించేలా ఉంది. అసలు మహేష్ ,శ్రీలీల ల లుక్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. మహేష్ ఫాన్స్ అయితే ఫుల్ సాంగ్ కోసం ఇప్పటినుంచే వెయిట్ చేస్తు ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

జనవరి 12నవరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లలో విడుదల అవుతున్న గుంటూరు కారంని హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎన్ .రాధాకృష్ణ నిర్మిస్తుండగా థమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.