మ్యాజికల్ మాస్ కాంబో ఈజ్ బ్యాక్.. ఈసారి స్పైసీగా ఉంటుంది!
షాక్, మిరపకాయ్ తర్వాత మ్యాజికల్ కాంబో మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అలాగే సంక్రాంతికి విడుదల కానున్న రవితేజ నటిస్తున్న ఈగల్ కూడా పీపుల్ మీడియా బ్యానర్ లో రూపొందుతుండటం విశేషం. ఇప్పుడు మాస్ రాజాతో మరో సినిమాని నిర్మించడానికి సిద్ధమైంది ఆ సంస్థ.