సూపర్ స్టార్ రజనీకాంత్ కి జన్మదిన శుభాకాంక్షలు
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ జన్మదినం ఈరోజే. ఆయనకు తెలుగు వన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. రజనీ కాంత్ సినిమా రిలీజవుతుందంటే అది ఒక సంచలనం. ఆయన నటించిన "బాషా, అరుణాచలం, ముత్తు, నరసింహ, శివాజీ, రోబో" చిత్రాలు సంచలన విజయాలను నమోదు చేశాయి.