English | Telugu

విడాకులు కోరుతున్న శరత్ బాబు భార్య

విడాకులు కోరుతున్న శరత్ బాబు భార్య అని ఫిలిం నగర్ లో ఒక రూమర్ బాగా వేగంగా వ్యాపిస్తోంది. సీనియర్ నటి రమాప్రభను ముందుగా నటుడు శరత్ బాబు వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆతన ఆమె నుంచి విడాకులు పొందారు. అనంతరం ప్రముఖ తమిళ సీనియర్ నటుడు నంబియార్ కుమార్తె స్నేహలతా దీక్షిత్ ను 1990 లో శరత్ బాబు వివాహం చేసుకున్నారు.

అయితే 21 సంవత్సరాలపాటు కాపురం చేసిన తర్వాత స్నేహలతా దిక్షిత్, నటుడు శరత్ బాబుల మధ్య ఈ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయట. శరత్ బాబు నుండి విడాకులు కోరుతూ ఆయన భార్య స్నేహలతా దీక్షిత్ కోర్టునాశ్రయిందిందట. అయితే కోర్టు వారు వీరిద్దరినీ కౌన్సిలింగ్ కు రమ్మని ఆదేశించారట. ఈ కేసు డిసెంబర్ 24 వ తేదీన విచారణకు వస్తుందని సమాచారం.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.