English | Telugu

ప్రముఖ నిర్మాత యమ్.యస్.రెడ్డి మృతి

ప్రముఖ నిర్మాత యమ్.యస్.రెడ్డి మృతి చెందారు. చనిపోయే నాటికి ఆయన వయసు 87 సంవత్సరాలు. యమ్.యస్.రెడ్డి నెల్లూరు జిల్లా, వెంకటగిరి మండలంలోని అలిమిలి గ్రామంలో 1924 వ సంవత్సరం, ఆగస్టు 15 తేదీన జన్మించారు. ఆయన నిర్మాతగా, రచయితగా, నటుడిగా తెలుగు సినీ రంగంలో ప్రసిద్ధులు. ఆయన "ఏకలవ్య, తలంబ్రాలు, అంకుశం, ఆహుతి, అమ్మోరు, బాలరామాయణం" వంటి అనేక చిత్రాలను నిర్మించారు.

ఆయన మాట కచ్చితంగా ఉందేది. అలాగే మనిషి కూడా అన్ని విషయాల్లోనూ చాలా నిక్కచ్చిగా వ్యవహరించేవారు.ముక్కుకు సూటిగా మాట్లాడే తత్వం ఉన్న ఆయనంటే అందరికీ భయంతో కూడిన గౌరవం. ఆయన ఏ విషయాన్నైనా కుండబ్రద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. యమ్.యస్.రెడ్డి ఇటీవల వ్రాసిన ఆయన ఆటోబయోగ్రఫీ పుస్తకంలో చిరంజీవి, యన్ టి ఆర్, వంటి అనేకమంది మీద విమర్శలు చేస్తూ వ్రాసిన "ఇది నాకథ" పుస్తకం చాలా సంచలనం సృష్టించింది.

యమ్.యస్.రెడ్డి తెలుగువన్ డాట్ కామ్ లోని "కిడ్స్ వన్" ఆవిష్కరణ సభకు విచ్చేసి, తెలుగు భాషకు తెలుగువన్ డాట్ కామ్ చేస్తున్న సేవలను శతధా కొనియాడారు. యమ్.యస్.రెడ్డి గత కొంతకాలంగా అస్వస్థులుగా ఉన్నారు. ఆయన నేటి ఉదయం అనగా డిసెంబర్ 11 వ తేదీ ఉదయం మరణించారు. ఆయన లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు ఎవరూ తీర్చలేనిది.

ఆయన మృతికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యన ప్రగాఢ సమతాపాన్ని తెలియజేశారు. డాక్టర్ రామానాయుడు, నాగబాబు వంటి అనేక మంది సినీ ప్రముఖులు ఆయన పార్దివ దేహాన్ని సందర్శించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.