English | Telugu

మనోజ్ తో మంచు లక్ష్మీ ప్రసన్న తమిళ చిత్రం

యువ హీరో మంచు మనోజ్ కుమార్ హీరోగా అతని సోదరి ప్రముఖ యాంకర్, నిర్మాత, నటి, అయిన మంచు లక్ష్మీ ప్రసన్న ఒక తమిళ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ మధ్య మన తెలుగు యువ హీరోలందరూ తెలుగుతో పాటు తమిళంలో కూడా తమ సినిమాలు వర్కవుటయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తమిళ హీరోలు సూర్య, విక్రమ్, కార్తీ, వంటి వారంతా ఇలానే తమిళ, తెలుగు భాషల్లో వర్కవుటయ్యేలా ప్లాన్ చేసుకుని అనువాద చిత్రాలతో మన డబ్బు కొల్లగొడుతూంటే, ప్రస్తుతం ఆ పని మన యువ హీరోలు రివర్స్ లో చేస్తున్నారు.

వారిలో అల్లరి నరేష్, నాని, శర్వానంద్, రానా ముందువరసలో ఉంటే కాస్త ఆలస్యంగానైనా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ కూడా తెలుగు, తమిళ భాషలకు సరిపోయేలా తన సినిమాను రూపొందించుకుంటున్నాడు. ఆ విధంగా మనోజ్ చేసేందుకు విలుగా మనోజ్ ని హీరోగా పెట్టి ఆయన సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న ఒక తమిళ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకు ఈ అక్కాతమ్ముళ్ళను తెలుగువన్ ప్రత్యేకంగా అభినందిస్తూంది. మనోజ్ ప్రస్తుతం "మిస్టర్ నోకియా", "ఊకొడతారా...! ఉలిక్కి పడతారా...!" చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.