English | Telugu

"పౌరాణిక చిత్రం చేయాలనుంది"- నాగ్

యువసామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున తనకు పౌరాణిక చిత్రంలో నటించాలనుంది అని తెలుగు వన్ కు ప్రత్యేకంగా తెలియజేశారు. వివరాల్లోకి వెళితే "రాజన్న" సినిమా ప్రమోషంలో భాగంగా తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్ వ్యూలో యువసామ్రాట్ నాగార్జున మాట్లాడుతూ "రాజన్న సినిమా చాలా బాగా వచ్చింది. నవంబర్ లో రిలీజ్ చేద్దామనుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ అంత మంచి సీజన్ కాదు...ఇప్పుడు వద్దన్నారు. అలా అనుకోకుండా నా ఫేవరెట్ మంత్ అయిన డిసెంబర్ లో 22 వ తేదీన రిలీజ్ చేస్తున్నాను. సోమవారం సెన్సార్ సర్టిఫికేట్ వస్తుంది." అని "రాజన్న" చిత్ర కథను తెలిపారు.

అనంతరం ఆయన ఇంకా మాట్లాడుతూ "నేను ఇంకెంత కాలం సోలో హీరోగా చేస్తానో తెలియదు. కానీ నేను నా సినీ జీవితంలో వెనుతిరిగి చూసుకుంటే కొన్ని సినిమాలు నేను గర్వంగా చెప్పుకునేలా ఉండాలనుకుంటున్నాను. ఆ దిశలో భాగంగా ఒక పౌరాణిక చిత్రం, ఒక జానపద చిత్రంలో కూడా నాకు నటించాలనుంది. పౌరాణిక చిత్రం అయితే మీసాలు లేని రాముడుగానో, కృష్ణుడుగానో నటించను. మీసాలుండే పాత్రలోనే నటిస్తాను." అని అన్నారు యువసామ్రాట్...!

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.