English | Telugu

"పేరెంట్స్" ఆడియో విడుదల

టేక్ వన్ ప్రొడక్షన్స్ పతాకంపై, "హ్యాపీడేస్" వంశీ హీరోగా నటిస్తూ, ఆనంద్ రవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం "పేరెంట్స్". ఈ "పేరెంట్స్" చిత్రానికి కె.బాలచంద్రన్ సంగీతాన్నందించారు. డిసెంబర్ 14 వ తేదీన, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రముఖ నటి "హ్యాపీడేస్" ఫేం సోనియా చేతుల మీదుగా, హీరో వరుణ్ సందేశ్ తొలి సి.డి.ని అందుకోగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో మార్కెట్లోకి విడుదల చేయబడింది.

అనంతరం ఈ చిత్రం యూనిట్ మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాణ సమయంలో తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. అతిథిలుగా విచ్చేసిన దర్శకులు అడివి సాయికిరణ్, "కర్మ" హీరో, "పంజా" విలన్ అయిన అడివి శేష్, నటుడు రణధీర్, నటి సోనియా తదితరులు ఈ చిత్రం యూనిట్ కు తమ శుభాభినందనలు అందించారు.

ప్రముఖ నిర్మాత దర్శకులు అయిన తమ్మారెడ్డి భరద్వాజ ప్రసంగిస్తూ మంచి సినిమాలు నూటికో కోటికో ఒకటి వస్తాయనీ, ఆ తర్వాత అన్నీ పిచ్చి సినిమాలే వస్తాయనీ, ఈ సినిమా చూడకపోతే ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూసే అనుభూతిని కోల్పోతారనీ అన్నారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.