Brahmamudi : భార్యాభర్తలలో ఎవరి డిజైన్స్ హిట్. ఎవరివి ఫట్ ?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -571లో..... రాజ్ డిజైన్స్ చూసి మూర్తి మనకంటే కావ్య మేడం బాగేస్తుందని అనగానే.. తిట్టి పంపిస్తాడు. కావ్య, శృతిలు డిజైన్స్ బాగా వచ్చాయని మాట్లాడుకుంటారు. అదంతా చాటు నుండి రాజ్ విని వాటిని దొంగతనం చెయ్యాలని అనుకుంటాడు. కావ్య, శృతిలు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే రాజ్ కావ్య క్యాబిన్ కి వెళ్లి డిజైన్స్ ఫోటో తీసుకుంటాడు. అప్పుడే కావ్య, శృతి లు బ్యాగ్ మర్చిపోయానంటూ వెనక్కి రావడం రాజ్ గమనించి టేబుల్ కింద దాక్కుంటాడు.