English | Telugu

Karthika Deepam2 : ఒకే బెడ్ పై దీప, కార్తీక్.. ఆమె మాటని నెరవేరుస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -202 లో .....కార్తీక్ బాబు తో భార్యలాగా ఉంటానని నాకు మాటివ్వమని అనసూయ అంటుంది. దాంతో నేను ఉండలేనని దీప అనగానే.. అయితే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని అనసూయ అంటుంది. ఏదో మీరు పెట్టె బుక్కెడు మెతుకుల కోసం నేను ఇక్కడ ఉండడం లేదు.. మీరు సంతోషంగా ఉంటే చూసి వెళదామని అనుకున్నానని అనసూయ ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడే కాంచన వచ్చి అనసూయ మాట ఇవ్వమని అడిగిన దాంట్లో తప్పేముంది.. కార్తీక్ చేసింది మంచి పని అని కాంచన సమర్థిస్తుంది. దీపకి కాస్త సమయం ఇవ్వమని కాంచన అంటుంది.

తన ప్రాణాలు అడ్డు పెట్టి భర్తని కాపాడుకున్న భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -253 లొ.....సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్తుంటే.. చూడు మీ అయన ఎలా చావుకి ఎదురు వెళ్తున్నాడోనని శ్రీలత అంటుంది. నా ప్రాణం అడ్డు పెట్టి అయినా నా భర్త ప్రాణాలు కాపాడుకుంటానని రామలక్ష్మి అంటుంది. మర్యాదగా నువ్వు ఎవరికి ఫోన్ చేసావో వాళ్ళకి ఫోన్ చేసి మా ఆయనని ఏం చెయ్యకని చెప్పు అనగానే.. నేను చెప్పను. నీ ఫోన్ తీసుకొని ఎవరితో మాట్లాడావో సాక్ష్యం మా ఆయనకి చూపిస్తానని  సందీప్ ఫోన్ ని రామలక్ష్మి లాక్కోబోతుంటే శ్రీలత లాక్కొని కింద పడేస్తుంది.