English | Telugu

యష్మీకి ఇచ్చిపడేసిన నైనిక.. నిఖిల్ వెనకాలే ఉన్నావ్!

 

బిగ్‌బాస్ హౌస్‌లో మొత్తానికి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్స్ ముగిసేసరికి ఈ వారం ఐదుగురు సభ్యులు లిస్ట్‌లో చేరారు. అయితే నామినేషన్స్ సమయంలో ఎక్స్ కంటెస్టెంట్లు లేవనెత్తిన విషయాలు హౌస్‌మేట్స్ మధ్య పెద్ద చిచ్చే రేపాయి. ముఖ్యంగా యష్మీ-నిఖిల్ మధ్య గట్టిగానే దూరం పెరిగింది.

ఇక మొదటిగా నబీల్‌ని నామినేట్ చేసింది నైనిక. నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పావ్ నబీల్.. షేర్ అన్నావ్ కదా. మరి ఆ షేర్ ఎక్కడికి వెళ్లిపోయింది. కొద్ది వారాలుగా నాకు నువ్వు అసలు కనిపించట్లేదు. ఇంకొకటి నువ్వు అందరి వెనకాల మాట్లాడుతున్నట్లు అనిపించింది. గౌతమ్ విషయంలో కూడా వాడికెందుకు ఓట్లు పడుతున్నాయన్నట్లు యష్మీకి నీకు మధ్య డిస్కషన్ జరిగిందంటూ నైనిక చెప్పింది. ఇక దీనికి డిఫెండ్ చేసుకుంటూ నేను వచ్చిందే ఆ కప్పు కోసం. కచ్చితంగా దాని కోసమే ఆడతా.. నేను ఎవరి గురించి వెనకాల మాట్లాడలే.. గౌతమ్ గేమ్ గురించి మాట్లాడా కానీ ఓట్లెందుకు పడుతున్నాయి అనే టాపిక్కే నేను తేలేదంటూ నబీల్ చెప్పాడు. ఆ తర్వాత తన రెండో నామినేషన్ యష్మీకి చేసింది. ఒకప్పుడు యష్మీ ఇప్పుడు అసలు నాకు కనిపించట్లేదు. ఎప్పుడైతే నువ్వు నిఖిల్ వెంట పడటం మొదలుపెట్టావో అప్పటి నుంచి యష్మీ మిస్ అయిపోయింది. ఎక్కడ చూసినా నిఖిల్‌తోటే కనిపిస్తున్నావ్.. అలా అని నువ్వు ఎఫర్ట్స్ పెట్టడం లేదా అంటే పెడుతున్నావ్.. కానీ అవి కనిపించట్లేదని నైనిక అంది.

ఇక యష్మీ ఏడ్చేస్తూ తన డిఫెండ్ చేసుకుంది. నేనెందుకు ఇలా అయిపోయానో నాకు అర్థం కావడం లేదు.. నేను బాగానే ఆడుతున్నా అంటూ యష్మీ ఏడ్చింది. ముందు యష్మీని తీసుకొస్తా.. కప్పు కొట్టడానికి ట్రై చేస్తానంటూ యష్మీ మాటిచ్చింది. ఇక యష్మీ కపటనాటకం మొదలెట్టింది. నిజాలు మాట్లాడితే యష్మీ ఏడ్చేస్తుందనే విషయం ఆడియన్స్ అందరికి తెలిసిపోయింది.