English | Telugu

Brahmamudi : భార్యాభర్తలలో‌ ఎవరి డిజైన్స్ హిట్.‌ ఎవరివి ఫట్ ?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -571లో..... రాజ్ డిజైన్స్ చూసి మూర్తి మనకంటే కావ్య మేడం బాగేస్తుందని అనగానే.. తిట్టి పంపిస్తాడు. కావ్య, శృతిలు డిజైన్స్ బాగా వచ్చాయని మాట్లాడుకుంటారు. అదంతా చాటు నుండి రాజ్ విని వాటిని దొంగతనం చెయ్యాలని అనుకుంటాడు. కావ్య, శృతిలు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే రాజ్ కావ్య క్యాబిన్ కి వెళ్లి డిజైన్స్ ఫోటో తీసుకుంటాడు. అప్పుడే కావ్య, శృతి లు బ్యాగ్ మర్చిపోయానంటూ వెనక్కి రావడం రాజ్ గమనించి టేబుల్ కింద దాక్కుంటాడు.

కావ్య లోపలకి రాగానే డిజైన్స్ పేపర్స్ తారుమారుగా ఉండడంతో.. ఎవరో ఇక్కడికి వచ్చారనుకుంటుంది. రాజ్ సర్ డిజైన్స్ కోసం వచ్చారేమో ఈ మధ్య సర్ ఎప్పుడు ఎలా ఉన్నాడో అర్థం కావడం లేదని శృతి అనగానే అయన అలా ఎప్పటికి చెయ్యరు తనకంటూ ఒక క్యారెక్టర్ ఉందని కావ్య అంటుంది. ఎదురుపడితే గొడవపడతారు. ఇప్పుడు సర్ ని ఒక్క మాట అననివ్వరని శృతి అంటుంది. పర్లేదు మనపై మంచి ఒపీనియన్ ఉంది అయినా ఈసారి ఇలా తప్పదని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత కావ్య శృతిలు వెళ్లిపోయాక రాజ్ మిగతా ఫొటోస్ తీసుకొని వెళ్తాడు.

మరొకవైపు ధాన్యలక్ష్మి తనే స్వయంగా వంట చేసుకుంది. మీర మాట్లాడట్లేదు నాన్న అని రుద్రాణి అనగానే.. నా కోడలికి వంట చేసుకోవడానికి పాత్రలు సరిపోతాయో లేదో తీసుకొని వచ్చి ఇవ్వు అంటాడు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి సీతారామయ్య వెళ్ళగానే.. డిజైన్స్ దాచేసి.. రేపు మీ అందరికి సర్ ప్రైజ్ అంటాడు. రాజ్ ఎలాగైనా గెలవాలని కావ్య డ్రైవర్ కి ఫోన్ చేసి.. లేట్ గా తీసుకొని రమ్మని చెప్తాడు. మరొకవైపు కావ్య రెడీ అవుతుంటే పోటీలో నువ్వే గెలవాలని పూజ చేసి హారతి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.