English | Telugu

గౌతమ్, ప్రేరణల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్!

బిగ్‌బాస్ ఈవారం నామినేషన్స్‌ ప్రక్రియని నబీల్ మొదలుపెట్టాడు. హౌస్‌లో ఎవరినైతే ఫినాలేకి చూడకూడదని భావిస్తారో ఆ ఇద్దరినీ నామినేట్ చేయాలంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక నబీల్ ముందుగా గౌతమ్‌ని నామినేట్ చేశాడు. ఆదివారం ఎపిసోడ్‌లో తన గురించి గౌతమ్ రాసిన కంప్లెయింట్ నచ్చలేదని నబీల్ అన్నాడు. అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మేము టార్గెట్ చేశామని నువ్వు అనడం కరెక్ట్ అనిపించలేదు అంటూ నబీల్ అన్నాడు. ఇక దీనికి గౌతమ్ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటూ నబీల్ మధ్యలో మాట్లాడి వాదిస్తూనే ఉన్నాడు. ఇక చివరకి గౌతమ్ మాట్లాడి వేస్ట్ అన్నట్లు వెళ్లి మీద రంగు పోయించుకున్నాడు. ఇక నెక్ట్స్ తన రెండో నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు నబీల్. ఒక మనిషి మీద పెట్టే కాన్సట్రేషన్ గేమ్‌పై పెడితే బావుంటుంది.. నువ్వు ఇప్పటివరకూ ఒక్క టాస్కు కూడా గెలవలేదు అంటూ నబీల్ అన్నాడు. దీనికి విష్ణు ఏదో సోది చెప్పింది.   

బ్రహ్మముడి మానస్ కొడుకు పేరేంటో తెలుసా ?

బ్రహ్మముడి సీరియల్ రాజ్ అలియాస్ మానస్ నాగులపల్లి సెప్టెంబర్ 10 న ఒక మగబిడ్డకు తండ్రైన విషయం తెలిసిందే. రీసెంట్ గా తమ కుమారుడి నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు మానస్ అండ్ శ్రీజ. ధ్రువ నాగుల పల్లి అనే పేరు పెట్టి ఆ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు మానస్. అలాగే నామకరణ మహోత్సవం ఫొటోస్ ని కూడా ఫాన్స్ కోసం పోస్ట్ చేసాడు. దీంతో వెండితెర, బుల్లితెర పాపులర్ పర్సన్స్, ఫాన్స్, నెటిజన్లు  శుభాకాంక్షలు చెబుతూ మెసేజెస్ పెడుతున్నారు. ఇక మానస్ ఐతే బిడ్డను చూసుకుంటూ తెగ బ్లష్ ఐపోతూ కనిపించాడు. లాస్ట్ ఇయర్  నవంబర్ లో మానస్, శ్రీజను పెళ్లి చేసుకున్నాడు. ఇక మానస్ చైల్డ్  ఆర్టిస్టుగా స్క్రీన్ మీద అడుగుపెట్టాడు.

Karthika Deepam2 : బోర్డ్ మీటింగ్ కి పిలిచిన శివన్నారాయణ‌... సీక్రెట్ ప్లాన్ ని కార్తీక్ కనిపెట్టగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -211 లో.....దాస్ కుబీర్ గురించి ఆలోచస్తుంటే.. కాశీ వచ్చి చేతిలో ఉందేంటని అడుగుతాడు.ఏం లేదంటూ వెళ్ళిపోతాడు. మా నాన్న ఎవరినో వెతుకున్నాడని స్వప్నతో కాశీ అంటాడు. ఆ తర్వాత శివన్నారాయణ‌ దగ్గరికి సుమిత్ర వచ్చి.. కార్తీక్ పెళ్లి చేసుకున్న నుండి అసలు జ్యోత్స్న నిద్ర పోయింది లేదు. ఎప్పుడు చూసిన గదిలో లైట్ వేసి ఉంటుంది. దీనికి మీరే పరిష్కారం చూపాలి.. త్వరగా పెళ్లి చేసి అమెరికా పంపించాలని సుమిత్ర అనగానే.. నేను తన గురించే ఆలోచిస్తున్నాను.. రేపు నిర్ణయం తీసుకుంటానంటూ శివన్నారాయణ‌ దశరథ్ ని పిలుస్తాడు. రేపు బోర్డు మీటింగ్ అరెంజ్ చెయ్ అందరికి మెసేజ్ పెట్టమని చెప్తాడు.