English | Telugu

అమ్మాయిలని వాడుకొని వదిలేస్తున్నావ్ నిఖిల్...

 

బిగ్ బాస్ సీజన్-8 లో నామినేషన్లు ముగిసాయి. ఇక హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి చేసిన నామినేషన్లు హైలైట్ గా నిలిచాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నాగ మణికంఠ,  నైనిక వచ్చారు. 

హౌస్ లోకి మొదటగా నైనిక ఎంట్రీ ఇవ్వగా నబీల్, యష్మీలని నామినేట్ చేసింది. ఆ తర్వాత నాగ మణికంఠ వచ్చి నిఖిల్, నబీల్ లని నామినేట్ చేశాడు. ఇక కిర్రాక్ సీత ఎంట్రీ ఇచ్చి కన్నడ బ్యాచ్ కి ఇచ్చిపడేసింది. ప్రేరణ ఫ్లిప్పింగ్ ని బయటపెట్టింది కిర్రాక్ సీత. నీకు ఇక చీఫ్ అవ్వాలనే కోరిక లేదా అంటూ సీత అడిగింది. దీనికి ప్రేరణ నవ్వింది. దీంతో నువ్వు చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యావ్.. ఒక డిక్టేటర్‌లా బిహేవ్ చేశావ్. నువ్వు చీఫ్ అయ్యాక నీ వెనుక హౌస్ మేట్స్ మాట్లాడే మాటలు విన్నాను.. నెక్స్ట్ నువ్వు చీఫ్ కాలేవు.. ఎందుకంటే చీఫ్ అయిన తర్వాత చాలా చేంజ్ అయ్యావ్. గౌతమ్ మీద చిరాకు పడటం బాలేదు. మీ భర్త నీకు కిచెన్ లో ఉండొద్దని మంచిగా మాట్లాడమని చెప్పాడు కానీ కాసేపటికే మళ్లీ కిచెన్ దగ్గర దోస గురించి తేజతో నువ్వు గొడవపడ్డావ్.. ఇవన్నీ బయటికి నెగెటివ్‌గా వస్తున్నాయ్.. ముఖ్యంగా నువ్వు చిరాకుగా మాట్లాడే మాటలు గుచ్చుకుంటున్నాయనంటూ సీత చెప్పగా.. నేను మార్చుకుంటానంటూ ప్రేరణ అంది.

యష్మీకి తన సెకండ్ నామినేషన్ వేసింది సీత.. ఆల్‌మోస్ట్ నైనిక చెప్పిన పాయింట్లే చెప్పింది సీత. నువ్వు నిఖిల్ వెంట పడటం మొదలుపెట్టిన తర్వాతి నుంచి నీ గేమ్ పోయింది. నిఖిల్‌ ఉంటేనే నువ్వు కనపడుతున్నావ్.. అలా అని నువ్వు గేమ్ ఆడట్లేదా అంటే బాగానే ఆడుతున్నావ్.. కానీ నిఖిల్ అనే షాడోలో అది కనిపించట్లేదంటూ సీత చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే.. అటు వైపు నుంచి నీపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు.. నువ్వు ఆ ట్రాప్‌లో, నిఖిల్ గేమ్‌లో పడకు అంటూ సీత సలహా ఇచ్చింది. దీనికి ట్రాప్ అంటే ఏంటి నీ ఉద్దేశం అంటూ నిఖిల్ అడిగాడు. అదే స్ట్రాంగ్ ఉమెన్‌ని ఆడకుండా టార్గెట్ చేసి వాళ్లని డౌన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.. వాళ్లని వాడుకొని నీ గేమ్ సెట్ చేసుకున్నట్లు ఉందంటూ సీత కామెంట్స్ చేసింది. దీనికి రెయిజ్ అవ్వకుండా కాస్త ఆశ్చర్యంగా అది నీ అభిప్రాయమంటూ నిఖిల్ చెప్పాడు. అక్కడ నిఖిల్ ఒక్కసారిగా స్ట్రక్ అయినట్టు అనిపించింది. మొత్తానికి నిఖిల్ కి నిన్న ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. ఇక ఈ వారం పృథ్వీ, నిఖిల్, యష్మీ, ప్రేరణ, నబీల్ నామినేషన్లో ఉన్నారు.