English | Telugu

Karthika Deepam2 :  కార్తీక్ పుట్టిన రోజున గుడిలో దీప.. నెక్లెస్ ఇచ్చాడంటూ జ్యోత్స్న బడాయి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -209 లో.....జ్యోత్స్న కార్తీక్ బర్త్ డే అని కలిసి హగ్ చేసి విష్ చెయ్యాలి అనుకుంటుంది. అది కుదరకపోయేసరికి కనీసం ఫోన్ లో అయిన విష్ చెయ్ అని పారిజాతం సలహా ఇవ్వడంతో కార్తీక్ కి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. అప్పుడే కాంచన లిఫ్ట్ చేస్తుంది. బావకి ఇవ్వు విష్ చేస్తానని అనగానే.. ముందు హ్యాపీ మారీడ్ లైఫ్ అని విష్ చెయ్ అని కాంచన అంటుంది. ఎక్కడ మళ్ళీ కార్తీక్ తో గొడవపడుతుందోనని మేమ్ గుడికి వెళ్తున్నామంటూ ఫోన్ కట్ చేస్తుంది.