English | Telugu
గ్రూప్ గేమ్ ఆడుతున్నారని తెలిసిపోయింది..పృథ్వీని బాడీ షేమింగ్ చేశావన్న బేబక్క!
Updated : Nov 19, 2024
బిగ్ బాస్ హౌస్ లో ఎన్నడు లేనివిధంగా పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. సోనియా మొదటగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరికి షాకిచ్చింది. ఇక వచ్చీ రాగానే నిఖిల్, ప్రేరణనలని నామినేషన్ చేసి అందరికి షాకిచ్చింది. ఆ తర్వాత శేఖర్ బాషా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటూ ప్రేరణను నామినేట్ చేశాడు.
ప్రేరణలో రూడ్‌నెస్, అవతల వారిని కించపరిచేలా మాట్లాడటం, ఒక్కోసారి పురుగును చూసినట్లు చూడటం.. ఇవన్నీ జనాలు చూశారంటూ శేఖర్ బాషా అన్నాడు. ఆ తర్వాత పానిపట్టు టాస్కులో నిఖిల్ మీ ఇద్దరినీ రఫ్‌గా హ్యాండిల్ చేశాడని చెప్పి మీరు అనుకున్నారు.. అది మీకు బ్యాడ్ అనిపించింది కదా.. మరి ఆ పాయింట్‌తో నిఖిల్‌ని నువ్వు నామినేట్ చేసి ఉండొచ్చు కానీ నీ టీమ్ వాడైన గౌతమ్‌ని నామినేట్ చేశావంటూ శేఖర్ బాషా అన్నాడు. దీనికి నాకు గౌతమ్ మీద రీజన్ స్ట్రాంగ్‌గా అనిపించిందంటూ ప్రేరణ అనగానే.. మరి అంతే స్ట్రాంగ్ రీజన్ నిఖిల్ మీద ఉన్నప్పుడు ఎందుకు నామినేట్ చేయవని అనగానే.. ప్రేరణకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ తర్వాత యష్మీని నామినేట్ చేశాడు బాషా. కిల్లర్ గర్ల్స్ నామినేషన్ లో నా ఫ్రెండ్ అయినా సరే ప్రేరణని నామినేట్ చేస్తా అని అన్నావ్.. ఒక్కసారి అయిన నామినేట్ చేశావా అని శేఖర్ బాషా అన్నాడు. నాకు నామినేషన్ లో అప్పుడు వేరే వాళ్ళు స్ట్రాంగ్ అనిపించారని యష్మీ అనగానే.. అది కాదు మీరు ముగ్గురు నామినేషన్ ముందు ఎవరెవరికి వేయాలంటు డిస్కషన్ చేసుకుంటారు. ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని జనాల్లోకి వెళ్లిపోయిందంటూ నిఖిల్-పృథ్వీ-యష్మీల గురించి చెప్పుకొచ్చాడు. ఉదాహరణకు ఒక్కటి చెప్పాడు శేఖర్ బాషా.. రోహిణిని అవినాష్ సేవ్ చేసి నిఖిల్‌ని నామినేట్ చేసినప్పుడు.. అతను లైట్ తీసుకున్నాడు కానీ నీకెందుకు అంత పెయిన్ వచ్చిందంటూ యష్మీని కొశ్చన్ చేశాడు. ఇలా చాలా ఉదాహరణలు చూసిన తర్వాత మీది గ్రూప్ గేమ్ అని జనాలకి తెలిసిపోయిందంటూ బాషా చెప్పాడు.
మరోవైపు బేబక్క వచ్చి నిఖిల్, పృథ్వీలను నామినేట్ చేసింది. ముఖ్యంగా తన ఎలిమినేషన్‌కి నిఖిల్ కారణమని.. సోనియా కుక్కర్ పాయింట్‌కి నిఖిల్ ఒప్పుకున్నాడంటూ బేబక్క అంది. ఆ రోజు నువ్వు చెప్పావనే నేను అంత స్ట్రిక్ట్ గా ఉన్నాను.. అందువల్లే సీత ఎగ్ బుజ్జి చేసుకుంటా అంటే వద్దన్నా.. గ్యాస్ ఆన్ చేయనివ్వలేదు. ఒక్కసారే వంట చేద్దామని అని ఫిక్స్ అయి మనమంతా అనుకొని చేశాం. కానీ సోనియా నా మీద అదే పాయింట్ తో నామినేషన్ చేస్తే నువ్వు నాకు సలోర్ట్గా లేవు.. ఆమెకి బయాజ్(పక్షపాతం) గా ఉన్నావంటు బేబక్క సూపర్ పాయింట్ లాగింది. ఇక నిఖిల్ ఏదో కవర్ చేసుకున్నాడు. ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తూ ఒక మనిషిని ఎంత తక్కువ చేయాలో నీకు బాగా తెలుసు.. అప్పుడు నన్ను అలా చేసి పంపించావ్.. తర్వాత రోహిణిపై కూడా అలాంటి బాడీ షేమింగ్ చూపులు చూశావంటూ బేబక్క అంది. ఆ రోజు నువ్వు అలా చూసినందుకే నాకు సారీ చెప్పావ్.. టాస్క్ లు ఒక్కటే కాదు ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వాలి. నీకంటే బలమైన ఆటగాడు నిఖిల్ మీద ఎప్పుడైన గెలిచావా అంటు పృథ్వీని బేబక్క నామినేషన్ చేసింది. ఈ వీక్ నామినేషన్లు సూపర్ గా సాగుతున్నాయి.