English | Telugu

Brahmamudi : కావ్య నా భార్య.. మేము కలిసే ఉన్నాం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -568 లో.....రాజ్ తనే పందెంలో గెలవడానికి ఆఫీస్ కి వస్తాడు. ఎప్పటిలాగే కావ్యతో వార్ పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఎంప్లాయిస్ అందరిని పిలిచి రాజ్ కావ్య మధ్య ఉన్న పందెం గురించి చెప్తాడు. ఎలాగైనా ఈ పందెం నేనే గెలవాలి.. నాకు మీలో ఎంత మంది సపోర్ట్ చేస్తున్నారని రాజ్ అనగానే.. అందరు కావ్య మేడమ్ కి సపోర్ట్ అంటారు. దాంతో రాజ్ కి కోపం వస్తుంది. మీరు ఇలా చేస్తారని తెలుసు.. అందుకే చీటీలు రాసాను. మీకు వచ్చిన చీటీలో ఎవరి పేరు ఉంటే వాళ్లకి సపోర్ట్ చెయ్యాలని రాజ్ అంటాడు.