English | Telugu
Jabardast show : జబర్దస్త్ కామెడీ షోలో బూతు పురాణం.. రోజురోజుకి దిగజారుతుందా!
Updated : Nov 19, 2024
ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఫ్యామిలీతో కలిసి కూర్చొని కాసేపు నవ్వుకునే షో.. మరి ఇప్పుడేమో బూతులతో నిండిపోయి అసలు చూడలేని పరిస్థితి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరీ ఎక్కువగా వాడుతున్న జబర్దస్త్ స్కిట్స్ పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.
ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ షో ప్రోమో వచ్చింది. అందులో మొదటగా బుల్లెట్ భాస్కర్ స్కిట్లో.. బాల్యం ఇచ్చావ్.. తీసుకుని పోయావ్.. యవ్వనం ఇచ్చావ్ తీసుకుని పోయావ్.. కానీ భార్యని ఇచ్చావ్ ఎందుకు మర్చిపోయావని బుల్లెట్ భాస్కర్ అంటాడు. ఇక అతని భార్యగా నటించిన ఫైమా అయితే.. ‘మొన్న పక్కింటి శాంతికి ఫోన్ తీసుకుని వచ్చారట కదా.. డబ్బులు ఇచ్చిందా?’ అని అడిగితే.. ‘హా లేదు.. రూంకి వచ్చింది’ అని అన్నాడు. రూంకి ఎందుకు అని అని ఫైమా అంటే.. ‘అదే డబ్బులు ఇవ్వడానికి’ అంటూ డబుల్ మీనింగ్ పంచ్ వేశాడు బుల్లెట్ భాస్కర్. తరువాత.. కెవ్వు కార్తీక్ స్కిట్లో.. ‘వీడు నా కొడుకు.. నీ కొడుకు ఎక్కడా ఫారిన్ పంపించావా? అని యాంకర్ రష్మిని అడుగుతాడు కార్తీక్. దానికి యష్మీ.. ‘నాకు అలాంటివి ఏమీ లేవు’ అని అన్నది. ‘అంటే నీకు పెళ్లి కాలేదా?’ అని కెవ్వు కార్తీక్ అంటే.. ‘పెళ్లి కావడానికి కొడుకుని కనడానికి ఏం సంబంధంరా ’అని రష్మీ అంది.
ఇక ఇక్కడ డబుల్ మీనింగ్ కోటింగ్ మరీ పెరిగింది. అదేంటంటే.. ఆటో రాంప్రసాద్ స్కిట్ లో.. రాంప్రసాద్ హోమ్స్ నీడ్స్‌కి కస్టమర్‌గా వచ్చిన దొరబాబు.. మంచి చాప ఏదైనా ఉందా అని అడుగుతాడు. బెడ్లు తీసుకోండి సర్ అని రాం ప్రసాద్ అంటే.. బెడ్లు బెడ్ రూంలోనే ఉంటాయి.. చాప అయితే చుట్టబెట్టుకుని వెళ్లిపోవచ్చని దొరబాబు అంటాడు. సరేనని రామ్ ప్రసాద్.. చాప ఇస్తే.. ఇది మంచి చాపేనా?? లాస్ట్ టైం ఓ వెధవ చాప ఇచ్చాడు. రెండు మోకాళ్లు కొట్టుకుని పోయాయని దొరబాబు అన్నాడు. చాపకి మోకాళ్లు కొట్టుకునిపోవడానికి సంబంధం ఏంటండీ అని రామ్ ప్రసాద్ ఏమీ తెలియనట్టు అడిగితే.. ఆ మోకాళ్లు కొట్టుకుని పోవడం గురించి బాగా తెలిసిన యష్మీ.. హ హ హ అంటూ తెగ నవ్వేసింది. అంటే యష్మీకి అర్థమైన ఈ బూతుపురాణం జనాలందరికి అర్థమవ్వడానికి తెగ నవ్వేసింది. ఇది ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ అయ్యింది.
ఇక స్కిట్ లో సరే ఇంతకీ చాపపై మోకాళ్లు ఎందుకు కొట్టుకుని పోయాయి సర్ అని రాం ప్రసాద్ అడిగితే.. నేను యోగా టీచర్ని సార్.. పొద్దున్నే మోకాళ్లపైకూర్చుని యోగా చేస్తానని.. చాపపై చేసే ఆ భంగిమల్ని చేసి మరీ చూపించాడు దొరబాబు. ఇక ఆ భంగిమల్ని చూసి తెగ నవ్వుకుంది యాంకర్ యష్మీ. రోజు రోజుకి ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువవుతున్నాయంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ప్రోమోని మీరు చూశారా.. చూస్తే మీకనిపించిందో కామెంట్ చేయండి.