English | Telugu

దేనికి బ్రో అంత మాటనేశావ్.. నాగార్జున సరే..మరి చిరంజీవి ఎవరు?


 

బిగ్ బాస్ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోహైల్ చిన్న ఆర్టిస్ట్ గా మొదలై హీరోగా ఎదిగాడు. అలాగే బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చాడు. ఇక రీసెంట్ గా నాగార్జునను కలిసిన ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. అందులో కింగ్ తో ఏదో సీరియస్ గా ఐతే డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియోకి " కింగ్  నాగార్జున సర్, తెలుగు మూవీ  గ్రీకు గాడ్. వినయం, విధేయత ఆయన గుర్తులు. సిల్వర్ స్క్రీన్ మీద ఆయన ఒక లెజెండ్ అంతేకాదు తెలుగు సినిమాకు దొరికిన వజ్రం" అనే రేంజ్ లో ఒక కొటేషన్ కూడా పెట్టాడు.

దాంతో ఒక నెటిజన్ ఇలా అన్నాడు.."అలాంటప్పుడు చిరంజీవి ఎవరు ? ఆయన మూవీ ఇండస్ట్రీకి దొరికిన దేవుడు కాదా ? ఎవరిని కలిసినా ఇలా దేవుడు అంటావ్ ? ఎందుకు బ్రో ఇదంతా ?" అని ఘాటుగా ప్రశ్నించాడు. ఇక మరో నెటిజన్   గట్టిగానే రిప్లై ఇచ్చాడు.. "సరే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దేవుడు అన్నానని శ్రీశైలంలో శివుడుని దేవుడు అనడం మానేస్తారా బ్రో. మనకి సహాయం చేసిన ప్రతి ఒక్కరు దేవుడే.  

తెలుగు సినిమాకి ఒక్కరే హీరో వున్నారా..ఒక్కరినే దేవుడు అని పిలవడానికి.. నాగార్జున సర్, చిరంజీవి సర్ వీళ్ళే కాదు ప్రజల కోసం పాలిటిక్స్ లో కి వచ్చిన పవన్ కళ్యాణ్ సార్ కూడా దేవుడే, వరద సహాయం చెయ్యడానికి మొదటి ముందుకు వచ్చే ప్రభాస్ దేవుడే... చిన్నపిల్లలకు  హార్ట్ ఆపరేషన్ చేయించే  మహేష్ బాబు గారు కూడా దేవుడే యిలా చెప్తూ వుంటే టైం సరిపోదు బ్రో.. సోహెల్ సర్ నిజం మాట్లాడాడు.. తనకు సహాయం చేసిన వారిని దేవుడు అన్నారు..అది తప్పు కాదు కదా బ్రో...ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి బ్రో" అంటూ చెప్పుకొచ్చారు.