English | Telugu

Brahmamudi : రాహుల్ కి వార్నింగ్.. వాళ్ళిద్దరు వందకోట్ల అప్పు చేశారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -641 లో.....అనామిక, రుద్రాణి ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటారు. నేను రేపు జరగబోయే బారసాల ఫంక్షన్ కి వచ్చి.. పెద్దబాంబు పేల్చబోతున్న అని అనామిక అంటుంది. ఏంటని రుద్రాణి అడుగగా.. ఇప్పుడు చెప్పను. రేపు నువ్వే చూస్తావ్ కదా అని అనామిక ఫోన్ కట్ చేస్తుంది. ఏం చేస్తే ఏంటిలే ఆస్తులు మాకు రావాలని రుద్రాణి అనుకుంటుంది. మరుసటి రోజు బారసాలకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పు, కావ్యలు ఉయ్యాలా డెకరేషన్ చేస్తుంటారు. అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. వాళ్ళతో సరదాగా మాట్లాడుతుంది.

ఐ లవ్ యు..ఇక్కడ అందరూ ఉన్నారు కట్ చెయ్యి...నందుకు గీతా సీక్రెట్ ప్రపోజ్

వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. దాంతో బుల్లితెర మీద సందడి మొదలయ్యింది. ఏ షో చూసినా ఇప్పుడు అంతా ప్రేమికుల దినోత్సవమయమే  ఐపోయింది. ఇక ఇప్పుడు ఢీ షో కూడా ప్రేమికుల రోజు కాన్సెప్ట్ తో వచ్చిన డాన్స్ లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్ కంప్లీట్ గా వాలంటైన్స్ డే స్పెషల్ గా రాబోతోంది. ఇక ఈ షోలో హైపర్ ఆది నందుకి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. "నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గీతా మాధురికి ఫోన్ చేసి ఐ లవ్ యు" అని చెప్పు..అన్నాడు. ఇక నందు కూడా గీతకు ఫోన్ చేసాడు. తీసి చెప్పు అంది గీతా. దానికి నందు  "ఐ లవ్ యు" అన్నాడు. గీతా  "ఆ ఆ" అనేసి అసలు వినకుండానే కట్ చేసింది. ఫోన్ కట్ చేసేసింది ఇటు ఆది అటు హన్సిక పగలబడి నవ్వారు. దాంతో నందు ఈగో హర్ట్ అయ్యింది.

బాలకృష్ణ గారు ఇష్టమా, జూనియర్  ఎన్టీఆర్ గారు ఇష్టమా ? విశ్వక్ కి షాక్ ఇచ్చిన సుధీర్

ఫ్యామిలీ స్టార్ ప్రోమోలో యాంకర్ సుడిగాలి సుధీర్ విశ్వక్ ని అడిగిన ప్రశ్నకు ఒక్కసారిగా షాకయ్యాడు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున "లైలా" మూవీతో  ఆడియన్స్‌ని పలకరించబోతున్నాడు విశ్వక్ సేన్.  విశ్వక్ హీరోగా ఒక లేడీ గెటప్‍‌ లో కనిపించబోతున్నాడు . ఈ మూవీ ప్రమోషన్స్ కోసం లైలా మూవీ టీమ్ ఫామిలీ స్టార్స్ సెట్ కి వచ్చారు. ఇక ఈ  షోలో సుధీర్‌తో పాటు యాంకర్ స్రవంతి, అషూ రెడ్డి కూడా సందడి చేశారు. వీళ్ళ ఇద్దరితో కలిసి స్టెప్పులు వేశాడు విశ్వక్. ఇక ప్రోమో చివరిలో బాలకృష్ణ  విశ్వక్‌ సేన్ కి ముద్దు పెడుతున్న పిక్  చూపించి ఇంట్రెస్టింగ్ కొశ్చన్ అంటూ అడిగాడు  సుధీర్. "ఆ టైమ్‌లో టక్ మని బాలయ్య మీకు ముద్దు పెట్టగానే మీకు ఏం అనిపించింది" అంటూ సుధీర్ అడిగాడు. ముందుగా ఆయనకు పద్మభూషణ్ వచ్చినందుకు కంగ్రాట్స్ అని చెప్పాడు విశ్వక్. "మీరు ఇప్పటికీ ఆయన్ని బ్రో" అనే పిలుస్తారా అనేసరికి అవును అన్నాడు..

Karthika Deepam2 : పూజకి శివన్నారాయణని ఆహ్వానించిన దీప.. జ్యోత్స్నతో మాటల యుద్ధం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -275/ లో.... అసలు దీపకి డబ్బు ఎవరు ఇచ్చారు.. అది నేను చెయ్యాల్సిన పని.. ఇప్పుడు దీప ఎదురు అయితే ఎలా ఫేస్ చెయ్యాలని సుమిత్ర అనుకుంటుంది. అప్పుడే దీప ఇంటి గుమ్మం ముందు వచ్చి ఉంటుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పి లోపలకి రా అని శివన్నారాయణ అంటాడు. ఏంటని దీప అడుగుతుంది. శౌర్యా ఎలా ఉంది మొదటి ప్రశ్న.. ఇప్పుడు బాగుందని దీప చెప్తుంది. రెండవది డబ్బుల కోసం వాళ్ళు వచ్చారు.. నువ్వు ఎందుకు రాలేదని శివన్నారయణ అడుగగా.. అందరికి తెలిసాక నాకు తెలిసింది శౌర్య పరిస్థితి అని దీప చెప్తుంది.

Eto Vellipoyindhi Manasu : ఆస్తి పేపర్లు తిరిగిచ్చేసిన సవతి తల్లి.. భర్త కోసం యాగం చేపిస్తున్న భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -322 లో... సీతాకాంత్ కి హాని ఉందని రామలక్ష్మి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసి అందరు షాక్ అవుతారు. మా అమ్మవాళ్ళు మారారు అంటూ సీతాకాంత్ తనపై కోప్పడతాడు. మేమ్ ఏం చేస్తే మీరు నమ్ముతారని సందీప్ అంటాడు. మీరేం చేస్తే నమ్ముతారో నాకు తెలుసని శ్రీలత పైకి వెళ్లి ఆస్తుల పేపర్స్ తీసుకొని వచ్చి.. దీని కోసమే మేమ్ మిమ్మల్ని చంపాలి అనుకుంటున్నామని నువ్వు అనుకుంటున్నావ్ కదా.. అని డాక్యుమెంట్స్ రామలక్ష్మికి ఇస్తుంది శ్రీలత.