English | Telugu

తండేల్ మూవీ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర!

రీసెంట్ గా రిలీజయిన అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఐతే ఎంతో మంది అమ్మాయిల చేత కన్నీళ్లు పెట్టించే సీన్స్ కూడా ఇందులో ఉన్నాయి. లవర్స్ కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ. ఐతే ఈ మూవీ చూసి వెక్కి వెక్కి ఏడ్చింది పాగల్ పవిత్ర. నాగ చైతన్య కన్నీళ్లు పెట్టుకునే సీన్ ని చూపిస్తూ తానూ కూడా కన్నీళ్లు పెట్టుకుని అది వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

"కొన్ని సీన్స్ గురించి చెప్పడం కంటే ఫీల్ కావాల్సిందే. ఇప్పుడు అలానే నేను కూడా ఫీలవుతున్నా. ఈ సీన్ తో గతంలో నా హార్ట్ బ్రేక్ సీన్ నాకు గుర్తొచ్చింది" అంటూ కాప్షన్ పెట్టుకుంది. ఇక పవిత్ర కన్నీటి వీడియోని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. "నిజంగా ఆ సీన్ చూసినప్పుడు చాల ఎమోషనల్ గా అనిపించింది అక్క. ఎంత ఎమోషనల్ అయినావు బేటా?..మూవీ సూపర్. నువ్వు బెస్ట్ ఎంటర్టైనర్ వి.. ఎమోషనల్ అవ్వొద్దు. బేబీ ఏమైంది నీకు ఏడుస్తున్నావ్?" అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక లాస్ట్ ఇయర్ పవిత్ర సంతోష్ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక ఎవరి దారి వారిది అంటూ విడిపోయారు. ఐతే వీళ్ళు కలిసి షోస్ కి వచ్చారు. తర్వాత రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏమయ్యిందో కానీ ఇద్దరూ విడిపోయారు. లాస్ట్ ఇయర్ ఇదే నెలలో విడిపోయారు. వీళ్ళు విడిపోయి కరెక్ట్ గా ఏడాది అయ్యింది. ఇప్పుడు తండేల్ మూవీతో తన ఓల్డ్ లవ్ స్టోరీను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుని పవిత్ర.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.