English | Telugu

ఐ లవ్ యు..ఇక్కడ అందరూ ఉన్నారు కట్ చెయ్యి...నందుకు గీతా సీక్రెట్ ప్రపోజ్

వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. దాంతో బుల్లితెర మీద సందడి మొదలయ్యింది. ఏ షో చూసినా ఇప్పుడు అంతా ప్రేమికుల దినోత్సవమయమే ఐపోయింది. ఇక ఇప్పుడు ఢీ షో కూడా ప్రేమికుల రోజు కాన్సెప్ట్ తో వచ్చిన డాన్స్ లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్ కంప్లీట్ గా వాలంటైన్స్ డే స్పెషల్ గా రాబోతోంది. ఇక ఈ షోలో హైపర్ ఆది నందుకి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. "నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గీతా మాధురికి ఫోన్ చేసి ఐ లవ్ యు" అని చెప్పు..అన్నాడు. ఇక నందు కూడా గీతకు ఫోన్ చేసాడు. తీసి చెప్పు అంది గీతా. దానికి నందు "ఐ లవ్ యు" అన్నాడు. గీతా "ఆ ఆ" అనేసి అసలు వినకుండానే కట్ చేసింది. ఫోన్ కట్ చేసేసింది ఇటు ఆది అటు హన్సిక పగలబడి నవ్వారు. దాంతో నందు ఈగో హర్ట్ అయ్యింది.

ఐతే వెంటనే మళ్ళీ గీతా ఫోన్ చేసింది నందుకు..నందు ఫోన్ లిఫ్ట్ చేసి "ఐ లవ్ యు " అన్నాడు. " ఐ లవ్ యు టూ ఇక్కడ అందరూ ఉన్నారు. కట్ చెయ్" అంటూ గుసగుసగా చెప్పి పెట్టేసింది. ఆ మాటతో అందరూ ఫిదా ఇపోయారు. ఇక నందు ఐతే ఫుల్ జోష్ గా ఉన్నాడు. టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో సింగర్ గీతామాధురి, నటుడు నందు జంట ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నందు – గీతామాధురి 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2019లో వీరికి ఒక పాప పుట్టింది. ఆ పాపకు దాక్షాయణి ప్రకృతి అనే పేరుని పెట్టారు. ఆ తర్వాత వీళ్లకు ఒక బాబు పుట్టాడు. ఆ పిల్లాడి పేరును ‘ధృవధీర్ తారక్’ అని పేరు పెట్టుకున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.