చూసింది, విన్నదే మాట్లాడా...తప్పేంటి...నా మాటలను వక్రీకరిస్తే....
అనసూయ పెట్టే ట్వీట్స్ ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా ఆమె పెట్టిన ఒక ట్వీట్ కూడా అలాగే వైరల్ అయ్యింది. "నాకు ఎదురైన అనుభవాన్ని, నేను చూసిన సంఘటనలను మాత్రమే షేర్ చేసుకున్నా తప్ప ఎవరిని నేను బ్లేమ్ చేసే ఉద్దేశం లేదు. అందరికీ అవగాహన కల్పించడం కోసమే మాట్లాడాను. ఆడియన్స్ కి, మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒక్కటే దయచేసి ఎవరూ కూడా నా మాటలను వక్రీకరించి, నేను అనని మాటలను నేను అన్నట్టు ట్రోల్ చేయొద్దు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. నన్ను అర్థం చేసుకున్న వారికి మాత్రమే నా ప్రేమను అందిస్తాను..