English | Telugu

భద్రవతి ఫోన్ తో పెళ్ళి వద్దనుకున్నారు.. రామరాజు షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -77 లో.....రామరాజు, వేదవతి లు చందుకి అమ్మాయిని చూడడానికి రెడీ అవుతారు. అన్నయ్య మంచోడు తనకి మంచి అమ్మాయి ని చుడండి అని సాగర్, ధీరజ్ లు చెప్తారు. నాన్న ఎలాగ కట్నం వద్దని అంటాడు కాబట్టి ఆడపడుచు కట్నం కంపల్సరీ అని చెప్పమని కామాక్షి అనగానే నువ్వు నీ ఆడపడుచు కట్నం అంటూ చిరాకు పడుతారు. ఇద్దరు బయలుదేరి వెళ్తుంటే.. అందరు నవ్వుతూ బై చెప్తుంటారు. అదంతా భద్రవతి చూడాలేకపోతుంది.

రామరాజు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అమ్మాయి బాగుందని వేదవతి చెప్తుంది. రామరాజు ఉన్న విషయం దాచిపెట్టకుండా ఇద్దరు కొడుకులు ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్తాడు. అందులో తప్పేముందని అమ్మాయి తండ్రి పాజిటివ్ గా మాట్లాడతాడు. అమ్మాయికి చందు ఫోటో చూపించిగానే తను సిగ్గు పడుతుంది. మా వాడు నచ్చాడా అని వేదవతి అంటుంది. ఇద్దరు సంబంధం ఒకే అనుకుంటారు. మరొకవైపు ప్రేమ, ధీరజ్ లకి తిరుపతి ఫోటో షూట్ ఏర్పాటు చేస్తాడు.

రామరాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పెద్దోడు చాలా మంచోడు తనకి మంచి సంబంధం వచ్చిందని మురిసిపోతాడు. ఆ తర్వాత భద్రవతి అమ్మాయి తండ్రి కి ఫోన్ చేసి సంబంధం ఒకే అయిందా అని అడుగుతుంది. ఒకే అయింది అని అతను చెప్పగానే.. ఆ రామరాజు డబ్బు ఉన్న అమ్మాయి లకి తన కొడుకులచే ఎర వేసి లేచిపోయి పెళ్లి చేసుకునేలా చేస్తాడు. ఇద్దరు కొడుకు లు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అంటూ పూర్తిగా రామరాజు గురించి తప్పుగా చెప్తుంది. రామరాజు, వేదవతిలు ఇంటికి వస్తారు. అప్పుడే అమ్మాయి తండ్రి ఫోన్ చేసి.. మీ సంబంధం మాకు వద్దని చెప్తాడు. రామరాజు షాక్ అవుతాడు. వెనకాల నుండి భద్రవతి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.