English | Telugu

ఏంటి రోహిణి గారు ప్రేమలో ఏమైనా పడ్డారా?

బుల్లితెర మీద జబర్దస్త్ కామెడీ షో ద్వారా లేడీ కమెడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రౌడీ రోహిణి. రోహిణి ఎక్కడ ఉంటె అక్కడ నవ్వులే నవ్వులు. ఈ మధ్య జబర్దస్త్ లోనే కాదు అన్ని షోస్ లో కనిపిస్తోంది. బలగం మూవీ, సేవ్ ది టైగర్స్ వంటి సినిమాలు, వెబ్ సిరీసులలో టైమింగ్ ఉన్న కామెడీ చేస్తూ నవ్విస్తోంది. ఐతే రోహిణి బిగ్ బాస్ సీజన్ 3 కి వెళ్లి వచ్చింది. అలాగే చాన్నాళ్లకు బిగ్ బాస్ 8  కి కూడా వెళ్లి వచ్చింది. ఐతే ఇంతకుముందు బిగ్ బాస్ కి వెళ్లినా రానంత పేరు ఈ సీజన్ 8 కి బాగా వచ్చింది. దాంతో ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి అవినాష్, హరితో కలిసి వచ్చి మరీ ఎంటర్టైన్ చేస్తోంది.

సిక్స్ ప్యాక్ కోసం ఆదిరెడ్డి కష్టాలు...మనకెందుకన్నా ఇలాంటి సాహసాలు..

యూట్యూబ్ లో బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే ఆదిరెడ్డి ఇప్పుడు బుల్లితెర స్టార్ ఐపోయాడు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న ఆదిరెడ్డి ఫైనల్ కి వెళ్లి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక సెలెబ్రిటీ హోదాతో టీవీ షోస్ కి వస్తున్నాడు. అలాగే తన భార్య కవితను కూడా షోస్ కి తీసుకొస్తున్నాడు. అలాగే విజయవాడలో ప్రముఖ సెలూన్ కంపెనీ జావేద్ హబీబ్ బ్రాంచ్ తీసుకొని ప్రారంభించాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇష్మార్ట్ జోడి 3 కి తన భార్యతో కలిసి వచ్చాడు. ఇలా ఆదిరెడ్డి షోస్ అన్నిట్లో పాల్గొంటూ తన సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రీసెంట్ ఒక డంబెల్ తో వర్కౌట్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసాడు. ఐతే పాపం సిక్స్ ప్యాక్ కోసం తెగ కష్టపడుతున్నాడు.

Illu illalu pillalu : విశ్వ గొంతుపట్టుకొని వార్నింగ్ ఇచ్చిన రామరాజు.. అవమానించిన భద్రవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -73 లో.......సాగర్, చందు, తిరుపతి లు మాట్లాడుకుటంటే.. అప్పుడే ధీరజ్ వస్తాడు. నేను ఈ రోజు ఇక్కడే పడుకుంటానని అంటాడు. అప్పుడే నర్మద వచ్చి.. టైమ్ చాలా అవుతుంది. పడుకోరా అని సాగర్ దగ్గరికి వస్తుంది. నర్మద ఈ ఒక్క రోజు ఇక్కడే పడుకుంటానని అనగానే సరే అంటు నర్మద వెళ్ళిపోతుంటుంది. నర్మదని ఎలా రిక్వెస్ట్ చేస్తున్నావ్ రా అంటూ తిరుపతి సాగర్ ని ఆట పట్టిస్తాడు. ముందు ఎవరు ప్రేమించారని సాగర్ ని తిరుపతి అడుగగా.. నేను కాదు, ముందు తనే నన్ను ప్రేమించమని వెంటపడిందని సాగర్ బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అదంతా నర్మద విని నీ సంగతి చెప్తానని అనుకుటుంది.

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి కొత్త ప్లాన్.. వారి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -319 లో.... రామలక్ష్మి, సీతాకాంత్ లు ఇంట్లోకి వస్తారు. వాళ్ళని చూసి సిరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎప్పుడు కలిసి ఉండాలి అన్నయ్య.. మీరు ఎక్కడికి వెళ్ళకూడదని అనగానే.. మేము ఎక్కడికి వెళ్ళాము. నువ్వు హ్యాపీగా ఉండడం కావాలని రామలక్ష్మి అంటుంది. అన్నయ్య వాళ్ళు ఇంటికి వచ్చేలా చేసినందుకు.. చాలా థాంక్స్ అమ్మ అని సిరి శ్రీలతతో సిరి చెప్తుంది. నాకు చాలా ఆకలిగా ఉందని సిరి అనగానే ఉండు నీకు ఇష్టమైన వంట చేస్తానని శ్రీలత కిచెన్ లోకి వెళ్తుంది.

బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో కూడా తెలీదు

బుల్లితెర మీద వర్షిణి అంటే తెలియని వారు ఉండరు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన  వర్షిణి  ఎన్నో బ్రాండ్లకు పని చేసింది.  'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లోనూ నటించినా వర్షిణికి పేరు రాలేదు.  శంభో శివ శంభో చిత్రంలో చిన్నరోల్  చేసింది. ఐతే ఆమె నటించిన లవర్స్, కాయ్ రాజా కాయ్, బెస్ట్ యాక్టర్స్ వంటి మూవీస్ ఆమెకు పెద్దగా పేరు తెచ్చపెట్టలేదు.  'ఢీ' షోలో మెంటర్‌గా పని చేసింది ఆ తర్వాత 'పటాస్' షోతో వర్షిణి యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఈ అమ్మడు పలు ఛానెళ్లలో ప్రసారమైన ఎన్నో షోలను హోస్ట్ చేస్తూ వస్తోంది.

Brahmamudi : అత్తకు చురకలు వేసిన అల్లుడు.. వాళ్ళని రుద్రాణి పెట్టుకుంటుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -635 లో....రాజ్, కావ్య అమెరికాకి వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటున్నారని రుద్రాణి ధాన్యలక్ష్మిలు ఇంట్లో గొడవ మొదలుపెడతారు. ఇదంతా ఎందుకు వాళ్ళు ఇంటికి వస్తారు కదా అప్పుడు అడుగుదామని వాళ్ళకి సమాధానం చెప్తుంది అపర్ణ. మరోవైపు రాజ్, కావ్యల దగ్గరికి వాళ్ళ డిజైన్ కొన్న అతను వస్తాడు. వచ్చి రెండు కోట్లు క్యాష్ ఇస్తాడు. మాకు ట్రాన్స్ఫర్ చెయ్యండి అని రాజ్ అనగానే.. ఇప్పుడు వీలవదు అర్ధం చేసుకోండి అని అతను అనగానే.. సరే అని క్యాష్ తీసుకుంటాడు.

రక్తంతో అమ్మానాన్నల చిత్రం...కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ కమెడియన్ తల్లి

జబర్దస్త్ కమెడియన్  అజర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ మొదలైన దగ్గర నుంచి ఎంతోమంది కమెడియన్స్ ఈ షోకి వస్తూ పోతూ ఉన్నారు. అందులో పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటె కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. అజర్ కూడా అలాగే వచ్చాడు. ఐతే కామెడీ పెద్దగా చేయలేడు కానీ ఏదో స్కిట్ కి ఒక హ్యాండ్ ఒక సపోర్ట్ అన్నట్టుగా ఉంటాడు. మొదట్లో రీతూ చౌదరితో కలిసి చాలా స్కిట్స్ చేసేవాడు. తర్వాత రీతూ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయి తన సాంగ్స్ చేసుకుంటూ ఉంది. ఇక అజర్ ఇక్కడ జబర్దస్త్ లో కంటిన్యూ అవుతున్నాడు. అలాంటి అజర్ తన పేరెంట్స్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఐతే ఇచ్చాడు. నిజంగా ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి అజర్ వాళ్ళ అమ్మ కొడుకుని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఐతే ఇంతకు ఎం గిఫ్ట్ అనుకుంటున్నారా.  

ఆమె యాంకరింగ్ వదిలి వెళ్ళదు..శ్రీదేవి డ్రామా కంపెనీకి అదృష్ట దేవత రష్మీ  

శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయ్యి నాలుగేళ్లు అవుతున్న సందర్భంలో ఈ ఎపిసోడ్ మొత్తం రష్మీ యాంకరింగ్ చేస్తుందా లేదా ? శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ యాంకర్ ఎవరు ? అన్న కాన్సెప్ట్ మీద జరిగింది. ఐతే రష్మీ తప్ప వేరే యాంకర్ వద్దు అంటూ ఆది చెప్పాడు. "యాంకర్ గా రష్మీ చాలా బాగా చేస్తుంది. ఒక కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, ఒక జోక్ క్రియేట్ చేయాలన్నా ఎంత కష్టమో రష్మీకి తెలుసు. అందుకే రష్మీ ఎప్పుడూ ఎవరితో కూడా ఈ జోక్ వద్దు ఆ జోక్ వద్దు అంటూ చెప్పదు. ప్రతీ జోక్ ని చాలా ఈజీగా తీసుకుంటుంది. అలాగే చిన్న, పెద్ద ఆర్టిస్ట్ అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా పలకరిస్తుంది.